చిన్నారి నిద్ర కోసం!


Tue,September 11, 2018 01:06 AM

పిల్లలు పగలంతా పడుకొని రాత్రి మనల్ని జాగారం చేయిస్తుంటారు. పైగా కారణం లేకుండా ఏడ్చేస్తుంటారు. ఏమీ చేయలేక కొన్నిసార్లు చిరాకు పడుతుంటారు తల్లిదండ్రులు. చిరాకు పడకుండా పిల్లలను ఎలా నిద్ర పుచ్చాలో తెలుసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.
Baby-Sleep
పిల్లలను నిద్ర పుచ్చడమే కాదు.. వారికి ఎంత సౌకర్యవంతం కలిగిస్తున్నామనేది ముఖ్యం. అందుకే పడుకోబెట్టే మంచంగానీ.. తొట్టెలగానీ చాలా కంఫర్ట్‌గా ఉండేట్లు చూడాలి. మెత్తగా పక్కేయగానే పిల్లలు పడుకుంటారు అనుకుంటే పొరపాటే. దానికి తగ్గట్టుగా మంచి వాతావరణం కల్పించాలి. అంటే గాలి.. వెలుతురు.. నిశ్శబ్దం కలిగించాలి. దోమ తెరల్ని కచ్చితంగా వాడాలి. దీనివల్ల దోమలు, ఈగలు, ఇతర కీటకాలు డిస్టర్బ్ చేయకుండా నియంత్రించవచ్చు. నిద్రకు సేఫ్టీ కూడా ముఖ్యమే. సోఫాల్లో.. సింగిల్ బెడ్స్‌పై పిల్లలను పడుకోబెట్టొద్దు. ఎందుకంటే వాళ్లకు ఎటూ మెసల్లేకుండా ఉంటుంది కాబట్టి విశాలమైన ప్రాంతాల్లో పడుకోబెట్టాలి. ఇది సౌకర్యవంతమే కాదు.. సురక్షితం కూడా. అన్నింటికంటే మించి పాపతో పాటు మనమూ నిద్రపోయినట్టు కనిపించాలి. మీద చెయ్యేస్తూ దువ్వినట్టుగా.. నిమిరినట్టు చేయడం వల్ల పిల్లలు త్వరగా నిద్రపోతారు.

144
Tags

More News

VIRAL NEWS