చిన్నసాయం.. పెద్ద సమస్యకు పరిష్కారం


Sun,January 13, 2019 12:30 AM

ఆ విద్యార్థులు పాఠశాలకు చేరుకోవడానికి నానా కష్టాలు పడేవాళ్లు. రోడ్డు మార్గం లేని ఆ గ్రామస్తులు నదిలో సాహసం చేయాల్సి వచ్చేది. ఇదంతా చూసిన జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
women-collecter
పోతే మళ్లీ తిరిగి వస్తామో రామో తెలియదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలి. ఛత్తీస్‌గఢ్‌లోని బాలోడ్ జిల్లా అరాజ్‌పురి గ్రామం. ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లాలంటే నది దాటాలి. అది విద్యార్థులైనా, వృద్ధులైనా. రోడ్డు మార్గమే ఉండదు. పడవ ప్రయాణమే దిక్కు. విద్యార్థులు పక్క ఊర్లో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు గ్రామస్తులు ఖాళీ నూనె డబ్బాలు, కట్టెలతో పడవను తయారు చేసుకున్నారు. దాని ద్వారనే నది దాటి గమ్యం చేరేవారు. ఒక రోజు ఆ జిల్లా కలెక్టర్ కిరణ్ కౌషల్ గ్రామంలో పర్యటించారు. ఈ సమస్యను చూసిన ఆమె చలించిపోయారు. స్కూల్‌కి వెళ్లిన విద్యార్థులు తిరిగి వచ్చే సరికి నది ఒడ్డున బహుమతిని పెట్టారు. దాన్ని చూసిన చిన్నారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. కలెక్టర్ చేసిన చిన్న సాయం వల్ల పెద్ద సమస్యకు పరిష్కారం లభించింది. విద్యార్థుల కోసం, గ్రామస్థుల కోసం మోటార్ బోటును, లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేయించారు. హోంగార్డ్‌లను నియమించారు. దీంతో పాటు గ్రామస్తుల కోరిక మేరకు మరిన్ని ఫైబర్ బోట్లను కూడా పదిహేను రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు కలెక్టర్ కౌషల్.
women-collecter1

320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles