చిక్కీ తో చలికి చెక్


Mon,December 24, 2018 01:15 AM

చలి వల్ల వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. కానీ పకోడిల్లాంటివి తింటే కొవ్వు పెరుగుతుందనే భయం. అందుకే ఒంట్లో వేడి పుట్టాలంటే బెల్లంతో చేసిన చిక్కీలు తింటే మేలు. వీటివల్ల మరెంత మేలు జరుగుతుందో తెలుసుకోండి.
chikki-scam
-పల్లీల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతో పాటు అనేక పోషకాలున్నాయి. వీటిని బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది.
-చిక్కీ వల్ల రోగనిరోధక వ్యవస్థ, గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
-షుగర్ పేషెంట్లు మినహా మిగతావారు రోజుకు 20 గ్రాముల బెల్లం తింటే శరీరానికి మేలు జరుగుతుంది. బెల్లంలో ఇను ము, కాల్షియం తదితర పోషకాలున్నాయి.
-రుతు సమస్యల నుంచి మహిళలు ఉపశమనం పొందాలంటే చిక్కీ మంచి మందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
-పల్లీ ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి. ఎసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.
-బెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. కాబట్టి తరుచుగా చిక్కీలను తిని చలికే కాదు.. అనారోగ్యాలకు చెక్ పెట్టండి.

891
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles