చికిత్స కంటే నివారణే మేలు


Sun,April 14, 2019 12:23 AM

కొన్ని వ్యాధులకు చికిత్స కంటే నివారణే మేలు. తగిన జాగ్రత్తలు పాటిస్తే వాటిని నివారించవచ్చు. అలాంటి వాటిలో క్యాన్సర్ కూడా ఒకటి అంటున్నది క్యాన్సర్ నిపుణులు డాక్టర్ మైత్రి శంకర్.
cancer-doc
బెంగళూర్‌కు చెందిన డాక్టర్ మైత్రి శంకర్ అమెరికాలో న్యూరో ఫిజీషియన్ చదివింది. విదేశాల్లో ఉంటూ పలు దేశాల్లో క్యాన్సర్ వైద్య సేవలు అందించింది. ఈ క్రమంలో చాలా దేశాల్లో పూల తోటలు, ఆహార పంటలపై ఆమె దృష్టి పెట్టింది. గార్డెనింగ్ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో మైత్రి కూడా అటువైపు ఆసక్తి పెంచుకొనేది. విదేశాల నుంచి సేకరించిన మొక్కలు తమ ఇంట్లో పెంచేది. అలా స్వస్థలానికి వచ్చిన మైత్రి ఇంటి దగ్గరనే సొంతంగా పూల తోటలు, కూరగాయలు పండించడం ప్రారంభించింది. నిజానికి క్యాన్సర్‌కు చికిత్స కంటే నివారించడమే ఉత్తమ మార్గం అంటున్నది. సరైన ఆహారం, పౌష్టికమైన భోజనం తీసుకోవడం వల్ల వ్యాధులను నివారించవచ్చు అంటున్నది. దేశంలో 2.5 మిలియన్ల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారని వారు ఆహార నియమాలు పాటిస్తే ఫలితం ఉంటుందని అంటున్నది. అందుకే తన దగ్గరకు వచ్చే బాధితులకు ఇలాంటి ఆహారాన్ని అందించడానికి తానే స్వంతంగా కూరగాయలు పండిస్తున్నట్టు చెప్తున్నది. కేవలం కూరగాయలు, పూలే కాదు వాటి వృద్ధికి ఉపయోగపడే తేనెటీగలు, తుమ్మెదలు, పక్షులను కూడా పెంచుతున్నది. ఈ పక్షులను ఆకర్షించేందుకు ప్రత్యేకమైన చెట్లు, మొక్కలను పెంచుతున్నది. క్యాన్సర్ వంటి వాటిని నివారించడానికి ఆహారంలో జాగ్రత్తలు పాటించడం ముఖ్యం అంటున్నది.

247
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles