చల్లని నీళ్లు బరువు తగ్గిస్తాయా?


Tue,September 4, 2018 12:02 AM

Cold-Water
చల్లని నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు అనే నమ్మకం జనాల్లో చాలా ఉంది. అందువల్ల కొందరు పొద్దున్నే నిద్రలోంచి లేవగానే చల్లని నీళ్లు తాగుతారు. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? చల్లని నీళ్లు తాగితే నిజంగానే బరువు తగ్గుతారా?


చల్లని నీళ్లు-ప్రయోజనాలు అనే అంశంపై తాజాగా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధన చేసింది. అధిక బరువుతో బాధపడేవాళ్లను మూడు విభాగాలుగా విభజించి చల్లని నీళ్లు తాగాలని సూచించారు పరిశోధకులు. 5 మిల్లీ లీటర్లు, 10 మిల్లీ లీటర్లు, 20 మిల్లీ లీటర్ల చొప్పున ఐస్ వాటర్‌ను లంచ్‌కు ముందు ఇచ్చారు. వారిలో చాలావరకు బరువు తగ్గారు. అయితే 20 మిల్లీ లీటర్లు తాగినవాళ్లలోనే ఎక్కువ మార్పులు కనిపించాయన్నారు. చల్లని నీళ్లు తాగుతూనే సరైన వ్యాయామం చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారనే విషయాన్ని ఈ సందర్భంగా కనిపెట్టారు. 10 కప్‌ల ఐస్ నీళ్లు 80 అదనపు కేలరీలను కరిగిస్తాయట. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ లెవల్స్‌ను కూడా పెంచడంతో పాటు కేలరీలను కరిగిస్తాయనీ పరిశోధకులు చెప్తున్నారు.

189
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles