చలికాలం పెదాల రక్షణ


Mon,December 17, 2018 01:38 AM

అతి సున్నితమైన పెదవులు చలికాలంలో అందవిహీనంగా తయారవుతాయి. దీనితో పాటు పగిలిపోయి బాధాకరంగా మారుతాయి. పొడిబారిన పెదవుల కోసం కొన్ని చిట్కాలు..
lip-injections
-రోజ్ వాటర్ తేనెను వాడడం వల్ల పెదాలు పగలవు, ఇది గొప్ప మాయిశ్చరైజర్‌లాగా పని చేస్తుంది. సున్నితమైన చర్మాన్ని అద్భుతంగా కాపాడుతుంది.

-తడి గ్రీన్ టీ బ్యాగ్ పొడిబారిన పెదవులకి మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఈ పద్ధతి పాత కాలం నాటిది, ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.

-నిమ్మరసం వయస్సు పై బడడాన్ని మళ్ళిస్తుంది. దీన్ని వాడడం వల్ల సున్నితమైన పెదాలు మీ సొంతం అవుతాయి.

-పాల మీగడలో ఎక్కువ మోతాదులో కొవ్వు ఉండడం వల్ల సహజమైన మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది.

-ఆలొవెరా సహజాసిద్ధ్దమైన ఔషధం. అలర్జీలను కూడా ఇది దూరం చేయగలదు, చర్మాన్ని మృదువుగా మార్చి కాంతి వంతంగా తీర్చిదిద్దుతుంది.

-దోసకాయ పగిలిన పెదాలకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది మళ్లీ తిరిగి మామూలు స్థితికి తీసుకువస్తుంది.

-కొబ్బరి నూనె అద్భుతమైన సహజసిద్ధ్దమైన చిట్కా. పగిలిన చర్మాన్ని బాగుచేయడంలో దీనికి సాటి ఏది లేదు. అనాదికాలం నాటి నుండి పాటించే పద్ధతి. ఇది పగుళ్లను, పొడిబారిన చర్మం నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

-పంచదార మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇది పగుళ్లను నివారించడంలోను, తిరిగి సహజ సిద్దమైన చర్మాన్ని పునరుద్దరించడంలోనూ సహాయ పడుతుంది.

614
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles