చర్మం పొడిబారకుండా..


Fri,February 1, 2019 12:16 AM

skin-damage
-నారింజ పండు తొక్క ద్వారా చర్మాన్ని సున్నితంగా మార్చుకోవచ్చు. నారింజ తొక్కలు ఎండబెట్టుకోవాలి. వాటిని మిక్సీలో వేసి పొడిగా తయారు చేసుకోవాలి. అందులో కొంచెం తేనె, పెరుగు కలిపి ముఖానికి పూసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీటితో కడుక్కోవాలి.
-ఆపిల్ తొక్కను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. అందులో కాస్త తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడుగాలి. ఇలా వారం పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
-మాగిన అరటి పండును మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. దానికి తేనె, పెరుగు కలుపుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడుక్కోండి.
-పొప్పడి ముక్కలు చేసి మిక్సీలో వేసి మిశ్రమంగా చేసుకోవాలి. ఆ మిశ్రమానికి కాస్త తేనె, నిమ్మకాయ రసాన్ని కలిపి ముఖానికి రాయాలి. కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి.
-టమాటాల రసం తీయాలి. అందులో కాస్త పసుపు, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. కొద్ది సేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల కూడా మీ చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది.

202
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles