చక్కెర వ్యాధి అదుపు ఇలా!


Thu,April 18, 2019 01:32 AM

ఆహారం, జీవన విధానం వివిధ కారణాల వల్ల చాలామంది మధుమే హంతో బాధపడుతున్నారు. డయాబెటిస్ అనేది ఇన్సులిన్ వైఫల్యం వల్ల వస్తుంది. పాంక్రియాటిక్ గ్రంధిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ను నియంత్రిస్తుంది. ఈ వ్యాధికి ఆవాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
Mustard-Seeds
-కప్పు ఆవాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే ఈ పొడిలో కొద్దిగ నూనె కలిపి ఇడ్లీ, దోశ వంటి వాటికి సైడ్ డిష్‌గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
-ఆవాలను బాగా ఎండబెట్టి నూనెలో వేయించుకుని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్టు, ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకుని తింటే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.
-ఆవాల పొడిని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తంలోని షుగర్‌లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలో దోహదపడతాయి.
-శరీరానికి అవసరమైన పోషక విలువలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవాలను నెయ్యిలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కరివేపాకు చేర్చి పొడి చేసుకుని రోజూ అన్నంలో కలిపి తింటే షుగర్ తగ్గుతుంది.
-కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి తింటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహారపదార్థాలు తీసుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకావు.

293
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles