చక్కెర చిట్కాలు


Mon,January 21, 2019 12:03 AM

chakkera
-చర్మంపై మృతకణాలను తొలగించడంలో చక్కెర చాలాబాగా పని చేస్తుంది. ముఖ్యంగా మోకాళ్లు, మోచేతులపై ఉండే మృత కణాలను నిమ్మకాయ ముక్కకు చక్కెరను అద్ది రుద్దితే చాలు నల్లగా ఉన్న చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
-మొక్కల ఆహారంలో చక్కెర అతి ముఖ్యమైనది. మొక్కలు కూడా గ్లూకోజ్‌ను చాలా బాగా ఇష్టపడతాయి. అయితే ఇంట్లో ఉన్న మొక్కలకు చక్కెరతో పాటు కాస్త వెనిగర్ కూడా కలిపితే చీమలు, ఈగలు, కీటకాలు రాకుండా ఉంటాయి.
-కొన్ని సందర్భాల్లో పెదాలకు ఉన్న లిప్‌స్టిక్ గ్లాసులకు, ఇతర పాత్రలకు అంటినప్పుడు దానిని తొలిగించడం చాలా కష్టం. అటువంటప్పుడు కొంచెం చక్కెర తీసుకొని రుద్దితే మరకలు పోతాయి.
-బొగ్గులతో నిప్పులు రాజేసే సమయంలో మంట పుట్టించేందుకు చక్కెర ఉపకరిస్తుంది.
-స్పైసీగా ఉన్న పదార్థాలను తిన్నప్పుడు పట్టలేనంత కారం వేస్తే నాలుకపై కాస్త చక్కెర వేస్తే సరి.. వెంటనే ఉపశమనం కలుగుతుంది.
-నెయ్యి, వెన్న పాల మీద మీగడ చేతికి అంటినప్పుడు అంత తేలికగా జిడ్డు వదలదు. అటువంటి జిడ్డును చక్కెరతో ఇట్టే వదిలించవచ్చు.

625
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles