చక్కని శిరోజాల కోసం..


Sun,February 3, 2019 12:40 AM

జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా బాగుంటుందంటారు. కానీ ఆ జుట్టు చిక్కులు లేకుండా, చుండ్రు బాధించకుండా ఉన్నప్పుడే జరుగుతుంది. జుట్టు ఒత్తుగా, చుండ్రు లేకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..
hair
-కప్పు మెంతులను రాత్రంతా పుల్లటి పెరుగులో నానబెట్టి ఉదయాన్నే పెరుగుతో కలిపి రుబ్బుకొని తలకు పూసుకొంటే జుట్టు రాలదు.
-ఒక గుప్పెడు తులసి ఆకులను ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్లలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.
-వస కొమ్ములను ఒక రోజు మంచి నీటిలో నానబెట్టి తర్వాత ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక చెంచా మోతాదుగా ఒక కప్పు పెరుగులో వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు తగిలేలా రుద్దాలి. ఒక గంట ఆగిన తర్వాత కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు పూర్తిగా తగ్గుతుంది.
-వారంలో కనీసం రెండుసార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే శిరోజాలు గట్టి పడుతాయి.
-చలికాలంలో హెయిర్ డ్రయర్లను వాడవద్దు. మెత్తని తువాలుతో తుడుచుకొని.. గాలికి ఆరనివ్వడం మంచిది.
-తాజా వెల్లుల్లి గడ్డల నుంచి తీసిన రసాన్ని మాడుకు పట్టించాలి. తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

552
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles