చక్కని చర్మం కోసం!


Mon,February 4, 2019 11:08 PM

చాలామంది మహిళలు సింపుల్‌గా ఉండాలనుకుంటారు. అంటే.. మేకప్ లేకుండా సాధారణంగా అన్న మాట. మరి అలా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం.
skincare
-ముల్తానీ మట్టి, శనగపిండి, గంధపు పొడి, రోజ్‌వాటర్‌ని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
-గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. అలోవెరా గుజ్జుని ముఖానికి రాస్తూ ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
-దూదిని వేపనూనెలో ముంచి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మానికి కావలసిన విటమిన్లని అందించడంతో పాటు తేమని అందిస్తుంది.
-గంధపు పొడి, రోజ్‌వాటర్‌ని రెండింటినీ కలుపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మొటిమలు రావు.
-అరచేతిలో బాదంనూనె వేసి బాగా కలుపాలి. నెమ్మదిగా ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.
-తేనె, గంధపు పొడి, నిమ్మరసం, రోజ్‌వాటర్ వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

246
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles