గౌరమ్మలకు గౌన్ల కళ!


Fri,August 31, 2018 01:29 AM

ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ ఇంటికి వచ్చే కళే వేరు.. ఆ ఆడపిల్ల నవ్వుతూ మహాలక్ష్మిలా ఇల్లంతా కలియ తిరుగుతూ ఉంటే.. చూడనీకె రెండు కండ్లు సరిపోవు..మరి మీ బంగారు తల్లులు బంగారాన్ని మించిన మెరుపుతో మెరిసిపోయేందుకు.. వారికి ఈ వారం గౌన్ల కలెక్షన్లు తీసుకొచ్చాం.. వేసి, చూసుకొని మురిసిపొండి మరి!
Fashan
1. ఆరెంజ్ ప్రింటెడ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో ఈ గౌన్ కుట్టాం. హ్యాండ్స్ దగ్గర బటర్ ైఫ్లె మోడల్‌లో కుచ్చుల్లాగా కుట్టాం. ఇది చూడముచ్చటగా కనిపిస్తున్నది. ఇక గౌన్ చివరన వైర్ పికో చేయడంతో అలల్లాగా కనిపిస్తున్నది. క్యాజువల్ లుక్ కోసం ఈ గౌన్ ట్రై చేయొచ్చు.

2. పిస్తా గ్రీన్ నెట్ లెహంగా ఇది. కాన్ కాన్ ఫినిషింగ్‌తో చూడముచ్చటగా ఉంది. దీనిమీద మల్టీ కలర్ నెట్ ఫ్యాబ్రిక్స్‌తో చిన్న చిన్న పువ్వులను, సీతాకోకచిలుకలను చేసి అటాచ్ చేయడంతో డిఫరెంట్ లుక్ వచ్చింది. పింక్ కలర్ రాసిల్క్ క్రాప్‌టాప్‌ని స్లీవ్‌లెస్‌గా డిజైన్ చేశాం. దీని మీద కూడా నెట్ ఫ్యాబ్రిక్‌తో పువ్వులను జతచేయడంతో గ్రాండ్ లుక్‌తో కనిపిస్తున్నది.

3. క్యూట్‌గా కనిపించాలంటే ఈ డ్రెస్ వేయాల్సిందే! ఈ గౌన్ కోసం గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో వచ్చిన ఇక్కత్ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకున్నాం. పైన యెల్లో కలర్ మీద సెల్ఫ్ పూల డిజైన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేశాం. పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్‌తో పువ్వుల్లా చేసి నెక్ లైన్‌ని హైలైట్ చేశాం. ఇక స్లీవ్స్‌కి ఇక్కత్ ఫ్యాబ్రిక్‌నే ఉపయోగించాం.
Fashan1
4. రాయల్ బ్లూ కలర్ నెట్ గౌన్ ఇది. పైన బ్లూ కలర్ రాసిల్క్‌ని ఉపయోగించాం. మొత్తంగా లాంగ్ గౌన్‌గా కుట్టాం. డ్రెస్ మొత్తం హెవీగా సీక్వెన్స్ వర్క్ చేయించాం. పువ్వుల డిజైన్, ఏనుగు బొమ్మలతో మెరిసిపోతున్నది. పైన కూడా సీక్వెన్స్ వర్క్‌తో నింపేశాం. ఈ డ్రెస్ పార్టీలకు పర్‌ఫెక్ట్ చాయిస్.

5. సింపుల్ అండ్ స్వీట్‌గా మెరిసిపోయేందుకు ఈ గౌన్ వేయాల్సిందే! తెల్లని ఫ్లోరల్ ఆర్గంజా, బ్లూ కలర్ నెట్ ఫ్యాబ్రిక్‌తో లేయర్లుగా కింద వైపు డిజైన్ చేశాం. పైన వరకు బ్లూ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించాం. దీన్ని స్లీవ్‌లెస్‌గా కుట్టాం. పైగా నెక్‌లైన్ దగ్గర తెల్లని రాసిల్క్‌తో పువ్వులను అటాచ్ చేశాం. మధ్యలో బ్లూ కలర్ రాసిల్క్ పువ్వు ఇవ్వడం అదనపు
ఆకర్షణ.

రితీషా సతీష్‌రెడ్డి
ఈశా డిజైనర్ హౌస్, సుచిత్రా, హైదరాబాద్
ఫోన్ : 8500767476
https://www.facebook.com/
eshadesignerworks/

974
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles