గోర్లు రంగు మారుతున్నాయా?


Thu,January 31, 2019 12:29 AM

ఎంత ఆరోగ్యంగా ఉన్న గోర్లయినా ఒక్కోసారి రంగుమారుతుంటాయి. ఉన్నట్టుండి పసుపురంగుల్లో లేదా నలుపు రంగులోకి మారుతుంటాయి. మరి ఇలా రంగు మారడం దేనికి సంకేతం..? నెయిల్ పాలిష్‌ల వల్ల ప్రమాదాలేమైనా ఉన్నాయా?
nails
గోర్లు ఉన్నట్టుండి రంగు మారడం అనారోగ్యానికి సంకేతమని డాక్టర్లు చెపుతున్నారు. గోర్లు లేత ఎరుపు రంగులో మిలమిలలాడుతుంటే ఏమీ చింతించాల్సిన పని లేదు. కానీ వేరే రంగులోకి మారితే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఇలా రంగు మారిన గోర్లు మళ్లీ కోలుకోవడానికి సుమారు నాలుగు నుంచి తొమ్మిది నెలలు పడుతుందట. అసలు ఇలా రంగులెందుకు మారుతాయంటే పలు కారణాలున్నాయి. నెయిల్ పాలిష్‌లోని రసాయనాలు గోరుతోపాటు, పక్కన ఉన్న చర్మంపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. శరీరాన్ని శుభ్రపరుచుకున్నట్టే గోర్లను కూడా రోజూ శుభ్రపరుకోవాలి. మెరుగైన హ్యాండ్ క్రీమ్‌లను, సానిటైజర్లను వాడి బ్యాక్టిరియా ఫంగల్‌ను దూరం చేసుకోవచ్చు. దీంతో పాటు నెయిల్ పాలిష్‌లో ఉండే టాల్యూన్ పార్మాల్డిహైడ్, ఎసిటోన్‌పారాబెంజ్ వంటి రసాయనాలు చర్మానికి హాని చేయటంతోపాటు వ్యాధులు రావడానికి కూడా కారణమవుతాయి. అందుకే గోర్లకు రంగులు వేసుకునేప్పుడు జాగ్రత్తలు పాటించాలనీ, లేదా రంగులు వేసుకోకపోవటమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

603
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles