గోరింటాకు బాగా పండాలంటే..


Mon,April 15, 2019 01:02 AM

gorintaku
-గోరింటాకు పెట్టుకున్నాక ఎక్కువ సమయం అలాగే ఉంచే ప్రయత్నం చేయాలి. చక్కెర, నిమ్మరసాల మిశ్రమాన్ని మాటిమాటికి అరచేతులపై ఐప్లె చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గోరింటాకు ఎండిపోకుండా ఉంటుంది. అలాగే వీలైనంత ఎక్కువగా మైదాకు పెట్టిన చోట వెచ్చదనాన్ని అందించాలి.
-ఇంట్లో ఉండే వారు పాన్‌పై కొంచెం ఇంగువ వేసి వేడి చేసి వచ్చే పొగపై చేతులను పెట్టి కాచుకోవాలి. గోరింటాకు పౌడర్‌ను ముందుగా నీళ్లలో నానబెట్టి అందులో అర స్పూన్ కాసు వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటే బాగా రంగు వస్తుంది.
-పిప్పరమెంట్‌ను నూరి గోరింటాకు పేస్ట్‌కు కలిపితే గోరింటాకు పెట్టుకున్న చోట బాగా ఎర్రగా పండుతుంది. మార్కెట్లో పిప్పరమెంట్ నూనె లభిస్తుంది. ఒక్కసారి తయారు చేసుకున్న పేస్ట్‌ను మళ్లీ ఇంకోసారి ఉపయోగించాలనకునేవారు దీన్ని ఫ్రిజ్‌లో భద్రపర్చుకోవచ్చు.
-సబ్బుతో కడుక్కున్న చేతులపై మెహందీ పెట్టుకుంటే ఎక్కువ రంగు వస్తుంది. మెహందీ పెట్టుకున్న తర్వాత చేతులపై నిమ్మరసం, చక్కెర కలిపిన మిశ్రమం కాటన్‌తో అద్దుకోవాలి. నిమ్మరసంలో ఉన్న సిట్రస్ ఎర్రగా పండడానికి సహాయపడుతుంది.
-చేతులకు లేదా కాళ్లకు పెట్టుకున్న మెహందీ డార్క్‌గా, అందంగా కనిపించాలంటే మెహందీని వాటర్‌తో క్లీన్ చేసుకోవద్దు. చేత్తో తొలగించాలి. లేదా రెండు చేతులు రుద్దుకుంటూ తొలిగించాలి. కానీ నీళ్లు ఉపయోగించి అస్సలు తొలిగించవద్దు.

750
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles