గోడకు సొబగులు..


Tue,March 12, 2019 01:26 AM

wall
ఎంత ఆకర్షణీయంగా సర్దినా గోడ వెలవెలబోతున్నదా? ఎన్నో వేల రూపాయలు వెచ్చించి వేసిన రంగు కూడా గోడకు అందం తేవడం లేదా? ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి.


- మీ కుటుంబ సభ్యుల ఫొటోలన్నింటినీ ఒకే విధంగా ఫ్రేమ్ కట్టించి ఖాళీగా ఉన్న గోడకు వేలాడదీయండి. ఇందులో ఫొటోలన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకుంటే గోడకు మంచి అందం వస్తుంది.
- గోడ మీద ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక ఫొటో పెట్టడం అంత బాగుండదు. దానికీ ఓ ప్రణాళికను రూపొందించుకోండి. వరుస క్రమంలో పెడితే ఫొటోలు బాగుంటాయి. వివిధ ఆకృతుల్లోనూ ఫొటోలు పెట్టవచ్చు.
- ఫొటోలన్నీ రంగుల్లో కాకుండా నలుపు తెలుపులోనే ఉండేలా చూసుకోవాలి. ఖాళీగా ఉన్న గోడకు ప్రత్యేక అందం రావడమే కాదు. ప్రతిరోజూ కుటుంబ సభ్యులను తలుచుకున్నట్లు ఉంటుంది.
- ఫొటోలు, ఫ్రేములు ఎక్కువగా లేని వారు ఇంట్లోని చిన్నారులు గీసిన చిత్రాలను, చార్టులను గోడలపై అంటిస్తే గోడలకు అందం చేకూరుతుంది. చిన్నారి చిత్రలేఖనాలను ప్రోత్సహించినట్లు ఉంటుంది.
- కొందరు గోడలపై పేయింటింగ్స్ వేస్తుంటారు. వాటిమీదే డ్రెస్సెస్ హ్యాంగర్, ఇతర ఫొటోలు పెడుతుంటారు. వీటివల్ల గోడకు అందం రాకపోగా అసహ్యంగా కనిపిస్తుంది. గోడలకు పెయింటింగ్స్ వేసినప్పుడు ఆ గోడను అలాగే వదిలేయడం మంచిది.

413
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles