గూగుల్ డిలీట్ చేసేసింది!


Wed,February 13, 2019 12:17 AM

మన ఫోన్‌లో ఏదైనా యాప్ మనకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేస్తాం, అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తాం. ఆ యాప్ వల్ల మొబైల్ స్లో అవుతుందని గమనిస్తే మళ్లీ ఆ యాప్‌ని ఎప్పుడూ డౌన్‌లోడ్ కూడా చేయం. కానీ.. గూగుల్ స్వయంగా కొన్ని యాప్స్ డిలీట్ చేసింది. అవేంటంటే..
deleted-apps
ఫొటోలు ఎడిట్ చేయడానికి, మరింత అందంగా మార్చుకోడానికి ప్లేస్టోర్‌లో వెతికి మరీ ఫొటో ఎడిట్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ యాప్స్ మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా? యూజర్లకు తెలియకుండా వారి ఫొటోలు, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లు, క్రెడిట్, డెబిట్‌కార్డుల సమాచారం దొంగిలిస్తున్నాయి. అందుకే గూగుల్ స్వయంగా అలాంటి యాప్స్‌ని వెతికి మరీ డిలీట్ చేసేసింది. ఆ యాప్స్ లిస్టును కూడా ప్రకటించింది. మీ మొబైల్‌లో కూడా ఈ యాప్స్ ఉంటే ఇప్పుడే డిలీట్ చేయండి. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం దొంగల బారిన పడే ప్రమాదముంది. ఒకవేళ ఇంకెప్పుడైనా ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కింద రివ్యూస్, ఆప్ రేటింట్ చూసి డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే మీ సమాచారమంతా హ్యాకర్లకు, దొంగలకు అర్పించినవారవుతారు.

ఇవే ఆ యాప్స్

Pro Camera Beauty, Cartoon Art Photo, Emoji Camera, Artistic effect Filter, Art Editor, Beauty Camera, Selfie Camera Pro, Horizon Beauty Camera, Super Camera, Art Effects for Photo, Awesome Cartoon Art, Art Filter Photo, Art Filter Photo Effcts, Cartoon Effect, Art Effect, Photo Editor, Wallpapers HD, Magic Art Filter Photo Editor, Fill Art Photo Edito, ArtFlipPhotoEditing, Art Filter, Cartoon Art Photo, Prizma Photo Effect, Cartoon Art Photo Filter, Art Filter Photo Editor, Pixture, Art Effect, Photo Art Effect, Cartoon Photo Filter

1138
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles