గూగుల్‌లో మనం ఏం వెతికాం?


Wed,December 26, 2018 01:38 AM

search_engine
మొహనికి అంటిన హోలీ రంగును ఎలా తుడుచుకోవాలి?.. ముగ్గులు వేయడం ఎలా?.. గత సంవత్సరమే కాదు.. ఈ సంవత్సరం కూడా మన వాళ్లు గూగుల్‌లో వీటి గురించి తెగ వెతికారు. ప్రతి ఏడాది ఆఖర్లో ఆ ఏడాది నెటిజన్లు ఎక్కువగా దేని గురించి వెతికారో గూగుల్‌ట్రెండ్స్ పేరుతో జాబితాలను విడుదల చేస్తుంటుంది. వీటిలో వ్యక్తులు, వార్తలు, సినిమాలు, పాటలు, ఎలా? ఏమిటి? ఇలాంటి విభాగాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన జాబితానే కాకుండా.. దేశాల వారీగా కూడా ఏం వెతికారో ప్రత్యేక జాబితాలుంటాయి. అలా ఈ ఏడాది మన దేశంలో దేని గురించి ఎక్కువగా వెతికామో ఈ పట్టికలు చూడండి.
robo

సినిమాలు

సినిమాలు (2018)
1. రోబో 2.0
2. బాగీ 2
3. రేస్ 3
4. లవేంజర్స్ ఇన్ఫినిటీ వార్
5. టైగర్ జిందా హై
6. సంజూ
7. పద్మావత్
8. బ్లాక్ పాంథర్
9. దఢక్
10. డెడ్‌పూల్ 2

సినిమా పాటలు (2018)

1. దిల్‌బర్ దిల్‌బర్
2. దరు బంధ్నామ్
3. తెరా ఫితూర్
4. క్యా బాత్ హై
5. దేఖ్‌తే దేఖ్‌తే
6. దిల్ దియాన్ గల్లన్
7. లాంగ్ లాచీ
8. బజ్ సాంగ్
9. దాస్‌పాసిటో
10. ప్రడా

దగ్గరగా... దూరంగా..

what-is
గూగుల్‌లో మ్యాప్స్‌లో నియర్ మీ.. అనే ఆప్షన్ ఉంటుంది. మీకు దగ్గరలోని కార్యాలయాలు, దుకాణాలు, ఇతర విషయాలను ఇది చూపిస్తుంటుంది. దీని ద్వారా దగ్గర ఉండే వాటి పట్ల నెటిజన్లు ఎక్కువగా దేని గురించి వెతికారో చూడండి. అలాగే అక్కడెక్కడో దూరంగా జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి ఏం వెతికారో చదువండి.

నియర్ మీ.. (2018)

1. మొబైల్ స్టోర్స్
2. సూపర్ మార్కెట్స్
3. గ్యాస్ స్టేషన్స్
4. క్యాష్‌పాయింట్
5. కార్ డీలర్స్
6. మసాజ్
7. ఫార్మసీస్
8. గైనకాలజిస్ట్
9. కన్వీనియన్స్ స్టోర్స్
10. జాబ్స్

స్పోర్ట్స్ ఈవెంట్స్ (2018)

1. ఫిఫా వరల్డ్ కప్
2. ఐపీఎల్
3. ఆసియా కప్
4. ఏషియన్ గేమ్స్
5. వింటర్ ఒలింపిక్స్
6. కామన్‌వెల్త్ గేమ్స్
7. వింబుల్డన్
8. ప్రో కబడీ
9. ఇండియన్ సూపర్ లీగ్
10. ఆస్ట్రేలియన్ ఓపెన్

వ్యక్తుల కోసం అన్వేషణ

priya-prakash
వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, వారి వివరాలు, ఫొటోల గురించి గూగుల్‌లో చాలామంది వెతుకుతుంటారు? అలా ఈ ఏడాది మన దేశంలో వీరి గురించి మనం తెగ వెతికాం అన్నమాట.

ఈ ఏడాది

1. ప్రియా ప్రకాశ్ వారియర్
2. నిక్ జోనస్
3. సప్నా చౌదరి
4. ప్రియాంక చోప్రా
5. ఆనంద్ అహుజా
6. సారా ఆలీఖాన్
7. సల్మాన్ ఖాన్
8. మేఘన్ మార్క్‌లే
9. అనుప్ జలోతా
10. బోనీ కపూర్

2017లో..

1. సన్నీ లియోన్
2. అర్షి ఖాన్
3. సప్నా చౌదరి
4. విద్యా వోక్స్
5. దిశా పటాని
6. సునీల్ గ్రోవర్
7. శిల్పా షిండే
8. బందగీ కాల్రా
9. సాగరిక ఘాట్జ్
10. రానా దగ్గుపాటి
అంటే.. ఈ ఏడాది ప్రియా వారియర్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేసిందన్నమాట. గత ఏడాది.. ఈ ఏడాది కూడా సప్నా చౌదరి గురించి ఎక్కువగా వెతుకడం, సన్నీ లియోన్ ఈ లిస్ట్‌లో లేకపోవడం.. గమనించొచ్చు.

ఎందుకు.. ఏమిటి.. ఎలా?

man-qmark
ఎందుకు.. ఏమిటి.. ఎలా అని వివిధ అంశాల గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో వెతుకుతుంటారు చాలామంది. అలా మనం ఎక్కువగా వెతికిన అంశాలు ఏమిటో చూడండి. గత ఏడాది కూడా ఏం వెతికామో పోల్చుకోవచ్చు కూడా.

ఎలా? (How to.. 2018)

1. వాట్సాప్‌లో స్టిక్కర్లు పంపడం ఎలా?
2. మొబైల్ నెంబర్‌తో ఆధార్ లింక్ చేయడం ఎలా?
3. రంగోలీ వేయడం ఎలా?
4. మొబైల్ నెంబర్ పోర్ట్ చేయడం ఎలా?
5. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడం ఎలా?
6. ఆయుష్మాన్ భారత్ యోజనకు దరఖాస్తు చేసుకోవడం ఎలా?
7. మొహంపై నుంచి హోలీ రంగు తొలిగించడం ఎలా?
8. పదో తరగతి ఫలితాలు వెతుకడం ఎలా?
9. రూబిక్ క్యూబ్‌ను పరిష్కరించడం ఎలా?
10. ఎన్‌ఆర్‌సీ అస్సోమ్‌లో పేరు పరిశీలించడం ఎలా?

ఏమిటి?(What is.. 2018)

1. సెక్షన్ 377 అంటే ఏమిటి?
2. సిరియాలో ఏం జరుగుతున్నది?
3. కికి చాలెంజ్ ఏమిటి?
4. మీటూ క్యాంపెయిన్ ఏమిటి?
5. బాల్ ట్యాంపరింగ్ అంటే ఏమిటి?
6. నిఫా వైరస్ ఏమిటి?
7. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి?
8. ల్యూనర్ ఎక్లిప్స్ అంటే ఏమిటి?
9. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏమిటి?
10. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే ఏమిటి?

ఎలా? (How to.. 2017)

1. మొబైల్ నెంబర్‌తో ఆధార్ లింక్ చేయడం ఎలా?
2. జియో ఫోన్ బుక్ చేసుకోవడం ఎలా?
3. ఇండియాలో బిట్‌కాయిన్ కొనడం ఎలా?
4. స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎలా?
5. మొహంపై హోలీ రంగు తొలిగించడం ఎలా?
6. జీఎస్టీ రిటర్న్స్ ఫైల్స్ చేయడం ఎలా?
7. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఎలా?
8. బిట్‌కాయిన్ మైన్ చేయడం ఎలా?
9. బిగ్‌బాస్ 11కు ఓటు వేయడం ఎలా?
10. ఇండియాలో ఇథేరియం కొనడం ఎలా?

ఏమిటి? (What is.. 2017)1. జీఎస్‌టీ అంటే ఏమిటి?
2. బిట్‌కాయిన్ అంటే ఏమిటి?
3. జల్లికట్టు ఏమిటి?
4. బీఎస్3 వెహికిల్ అంటే ఏమిటి?
5. పెటా అంటే ఏమిటి?
6. జియో ప్రైమ్ అంటే ఏమిటి?
7. కస్సినీ అంటే ఏమిటి?
8. ఫిడ్ జెట్ స్పిన్నర్ అంటే ఏమిటి?
9. ల్యూనర్ ఎక్లిప్స్ అంటే ఏమిటి?
10. రోన్సమ్‌వేర్ అంటే ఏమిటి?

1310
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles