గుడ్డు వెరీ గుడ్


Wed,May 15, 2019 01:14 AM

eggs
-కొందరు పిల్లలు ఎంత తిన్నా బలహీనంగానే కనిపిస్తుంటారు. కానీ రోజుకో గుడ్డు తినిపించడం వల్ల 94 శాతం మంది పిల్లలు బరువు పెరిగే అవకాశం ఉన్నట్లు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. రోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
-గుడ్డు శరీరంలోని హెచ్‌డీ ఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అంటే శరీరానికి మేలు చేసే కొవ్వు అన్న మాట. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తనాళాలు, గుండె జబ్బులు దరిచేరవని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
-గుడ్డులో కెరొటినాయిడ్లు ల్యూటిన్, జెక్సాంతిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. తొమ్మిది రకాల శరీర అవయవాల పనితీరుకు అవసరమైన అమినో ఆమ్లాలు ఇందులో ఉంటాయి.
-ఒక కోడిగుడ్డు సొనలో 300 మైక్రోగ్రాముల కొలైన్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరుకు, నరాల వ్యవస్థ బలంగా ఉండడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు విటమిన్ డి సహజంగా అందే ఆహార పదార్థాల్లో కోడి గుడ్డు ఒకటి.
-వారంలో కనీసం ఆరు కోడిగుడ్లు తినే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం తెలిపింది. అయితే కోడిగుడ్డును పగులగొట్టి తింటే మాత్రం పోషకాలు అందవు. ఉడకబెట్టి తిన్న కోడిగుడ్డు మాత్రమే ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

274
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles