గుడిపూలు.. సేంద్రీయ ఎరువులు


Sat,September 1, 2018 11:12 PM

నేటి యువతరం విభిన్నంగా ఆలోచిస్తున్నది. నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తున్నది. ఒక సరికొత్త ఆలోచనను ఆచరణలో పెట్టారు అహ్మదాబాద్‌లోని సిల్వర్ ఓక్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు. వాళ్లేం చేశారో తెలుసా?
organic
మనం గుడికి వెళ్లేటప్పుడు అగరుబత్తులు, కొబ్బరికాయలతో పాటు పూలను కూడా తీసుకెళ్తాం. పూజలు పూర్తయ్యాక తినేవి పక్కనపెట్టి పూలను నీటిలో పడేయడమో, డస్ట్‌బిన్‌లో వేయడమో చేస్తాం. తర్వాత అవి చెత్తపాలవుతాయి. అయితే అవే పూలు, కొబ్బరి ముక్కలు, ఆకులను వాడి ఎరువుగా తయారు చేశారు. దానికి సంబంధించిన మెషీన్‌ను కనిపెట్టారు. అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేట్స్ అయిన యష్ భట్, అర్జున్ టక్కర్‌కు ఈ ఆలోచన వచ్చింది. వారిద్దరూ కలసి ఆకులు, పూలను 15 రోజుల్లో సేంద్రీయ ఎరువుగా మార్చే యంత్రాన్ని రూపకల్పన చేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వారితో కలిసి దేవాలయాల నుంచి సేకరించిన 300 కిలోల పూల వ్యర్థాలను వంద కేజీల సేంద్రీయ ఎరువుగా మార్చే పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు.


గుజరాత్ టెక్నాలజీ యూనివర్సిటీ ఇన్నోవేషన్ కౌన్సిల్‌లో తమ నూతన ఆవిష్కరణను గురించిన కీలక ఉపన్యాసం చేశారు. వారి ప్రతిభను గుర్తించిన గుజరాత్ టెక్నాలజీ యూనివర్సిటీ వారికి రూ.95,000 గ్రాంటును మంజూరు చేసింది. దీనితో వీరు బోడక్‌దేవ్, దట్లేజ్, గట్లోడియా, నారాయణ్‌పురా, నవరంగ్‌పురా తదితర దేవాలయాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టారు. అంతేకాక మరో 22 దేవాలయాలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పటికే ఆయా దేవాలయాల్లో ప్రత్యేక బుట్టలను ఏర్పాటు చేసి పూలు, కొబ్బరి, ఆకులను సేకరిస్తున్నారు. వీటితో ఉత్పత్తి చేసిన ఎరువును రూ.60 కిలో చొప్పున అమ్ముతున్నారు. ఎరువును అమ్మాలనుకునేవారికి రాయితీ అందిస్తామని చెబుతున్నారు.

782
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles