గుండె ఎందుకు ఫెయిల్ అవుతుంది?


Mon,January 28, 2019 01:12 AM

మా చెల్లెలు వయస్సు 33 సంవత్సరాలు. పెండ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐదారేండ్లుగా ఆమెకు తీవ్రమైన ఆయాసం వస్తున్నది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. మొదట్లో దీనిని అస్తమా అని పొరబడ్డాం. పెద్దాసుపత్రిలో చూయిస్తే హార్ట్ ఫెయిల్యూర్‌గా నిర్ధారించారు డాక్టర్లు. ఈ వ్యాధి ఎందుకొస్తుంది? దీనికి శాశ్వత చికిత్స లేదా? హార్ట్ ఫెయిల్యూర్ అయితే చావు కోసం ఎదురుచూడటమా? ఏమైనా పరిష్కారం ఉందా? దయచేసి తెలుపగలరు.
- వినోద, మామిడిపల్లి

Councelling
వినోదగారూ.. మీ చెల్లెలు సమస్య బాధాకరం. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో కొందరికి ప్రెగ్నెన్సీ సమయంలోనో.. ప్రసవ సమయంలోనో గుండె అనారోగ్యానికి గురవుతుంది. ఏ మాత్రం తీవ్ర అసౌకర్యానికి గురయినా హాస్పిటల్‌కు వెళ్లడం అనేది ముఖ్యమైన చర్య. గుండెకు నష్టం చేయడంలో హైబీపీ, షుగర్, కరోనరీ డిసీజెస్ కారణం అవుతాయి. జెనెటిక్ మజిల్ డిజార్డర్, మితిమీరిన మద్యపానం అలవాటు, స్థూలకాయం వంటివి కూడా గుండె వైఫల్యానికి కారణం అవుతున్నాయి. గుండెకు రెండు విధాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి గుండె పంపింగ్ సామర్థ్యం క్షీణించడం వల్ల.. రెండోది కండరాలు గట్టి పడటం వల్ల. అలసిపోయినప్పుడు లేదా పడుకున్నప్పుడు శ్వాస అందకపోవడం.. మితిమీరిన అలసట.. ఒళ్లు వాపు రావడం వంటి లక్షణాలు గుండె వైఫల్యానికి సంకేతాలుగా భావించవచ్చు.

దీనిని గుర్తించడానికి హెమో గ్రామ్ సెక్రేటినైస్, థైరాయిడ్ తీరు, ఎలక్ట్రోలైట్స్ రక్తంలో చక్కెర, బీఎస్‌పీ, ఈసీజీ, ఎలక్ట్రో కార్డియోగ్రఫీ వంటి నిర్ధారణ పరీక్షలు జరుపుతారు. కొన్నిసార్లు కార్డియాక్ ఎంఆర్‌ఐ పెట్‌స్కాన్, మయోకండ్రియాల్ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. అన్ని వ్యాధుల మాదిరిగానే హార్ట్ ఫెయిల్యూర్‌నూ ముందుజాగ్రత్తలతో నిరోధించడమే ఉత్తమం. అధిక రక్తపోటు, మధుమేహంను నియంత్రించడానికి పోషకాలతో కూడిన పరిమిత ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. వ్యాధి లక్షణాలు తెలుసుకొని ముందుగానే గుండెవ్యాధి నిపుణులను కలవడం ద్యారా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మీరు చింతించకుండా ముందు సమస్య పరిష్కారానికి మార్గాలు ఆలోచించండి. జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకోవడం అవసరం. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు బాధపడినట్లుగా.. చావు కోసం ఎదురుచూడాల్సిన అవసరం రాదు. మీ చెల్లెలు జీవితకాలం గణనీయంగా పెంచవచ్చు.


డాక్టర్ పవన్ పొద్దార్
సీనియర్ ఇంటర్వెన్షనల్
కార్డియాలజిస్ట్
యశోద హాస్పిటల్స్

1865
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles