గుండె ఆరోగ్యానికి దానిమ్మ


Wed,October 19, 2016 01:53 AM

దానిమ్మరసం క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండె పోటును నివారించవచ్చని కాలీఫోర్నియాకు చెందిన ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు అంటున్నారు. గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా లేని భవిష్యత్తులో గుండెపోటు రావచ్చని అనుమానిస్తున్న కొంత మంది స్త్రీ పురుషులకు రోజుకు ఎనిమిది ఔన్సుల దానిమ్మ రసాన్ని మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఇచ్చారు. తర్వాత పరీక్షలు చేసినపుడు వారిలో చాలా మందికి 17 శాతం వరకు రక్తప్రసరణ మెరుగైనట్టు తెలిసింది. దానిమ్మరసంలో ఉండే రక్తనాళాలలోని అడ్డంకులను తొలగించే యాంటీఆక్సిడెంట్లు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని వారు చెబుతున్నారు. కాబట్టి గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకునే వారు రోజు దానిమ్మ రసం తీసుకుంటే మంచిది.

1490
Tags

More News

VIRAL NEWS

Featured Articles