గాల్లో తేలినట్టుందే..


Wed,February 13, 2019 12:14 AM

మీ గొడుగు గాల్లో తేలుతుందా? మీరు ఎక్కడికెళ్లినా మిమ్మల్ని ఫాలో అవుతుందా? ఏంటీ లేదు అని సమాధానం ఇద్దామనుకుంటున్నారా? అయితే ఆగండి. ఇంకో ప్రశ్న ఉంది. మీరు పట్టుకోకపోయినా మీ గొడుగు మిమ్మల్ని ఫాలో అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? ఇదిగో అలాంటి గొడుగునే మీకు పరిచయం చేస్తున్నాం.
umbrella
వానొచ్చినప్పుడో, ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడో బయటకు వెళ్లేటప్పుడు మనం గొడుగు తీసుకెళ్తాం. కాకపోతే మనం ఎక్కడికెళ్లినా దాన్ని మనం వెంట పెట్టుకోవాల్సిందే. రెండు చేతుల్లో ఏదైనా లగేజ్ ఉంటే అప్పుడు గొడుగు పట్టుకోవడం కష్టమే. అయితే.. ఈ ఫొటోలో కనిపించే గొడుగు అలా కాదు. ఈ దీనిని ఎవరూ పట్టుకోవాల్సిన అవసరం లేదు. దానంతటదే గాల్లో తేలుతూ మనల్ని ఫాలో అవుతుంది. దీన్నే ఫ్లోటింగ్ అంబ్రెల్లా అంటారు. యాప్ సాయంతో పనిచేసే ఈ గొడుగు సెన్సర్ల ఆధారంగా మనల్ని ఫాలో అవుతూ మన మీద ఎండ, వాన పడకుండా కాపాడుతుంది. కాకపోతే ఎటువైపు మనల్ని ఫాలో కావాలో మనం దీనికి ముందే సూచించి, సెట్ చేసి పెట్టాలి. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న ఈ గొడుగులను డ్రోన్‌బెల్లా అని కూడా అంటారు. గొడుగుల్లో ఇది హైబ్రీడ్ అన్నమాట. కాకపోతే ఇంకా పూర్తిస్థాయిలో ఇది అందుబాటులో లేదు. మార్కెట్లో దీని ధర రూ. 20 వేల వరకు ఉంది. పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ధర తగ్గే అవకాశం ఉంది.

437
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles