గల్లీ బాయ్ ముచ్చట్లు!


Wed,February 20, 2019 03:18 AM

బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా గల్లీబాయ్. రణ్‌వీర్ పక్కన గల్లీబాయ్‌గా నటించిన యువకుడి పేరు సిద్ధాంత్ చతుర్వేది. ఒక్క సినిమాతోనే స్టార్‌గా మారిన సిద్ధాంత్ తెరవెనుక ఆసక్తికరమైన విషయాలివి..
gully
-లైఫ్ సహీ హై కామెడీ సిరీస్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. నలుగురు యువకులు మొదటిసారి ఢిల్లీ వెళ్తే ఎలా ఉంటుందనే అంశం మీద ఆ సిరీస్ నడుస్తుంది. ఆద్యంతం నవ్వులు విరబూయించే ఈ సిరీస్ ద్వారా సిద్ధాంత్‌కు మంచి పేరొచ్చింది.
-అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ఇన్‌సైడ్ ఎడ్జ్ అనే స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్‌లో కూడా కీలకపాత్ర పోషించాడు.
-చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతూ రంగస్థల నటుడిగా రాణిస్తున్నాడు.
-కోకోకోలా వంటి అంతర్జాతీయ సంస్థల కమర్షియల్ యాడ్‌లలో నటించాడు.
-2012లో బాంబే టైమ్స్ నిర్వహించిన నేషనల్ ట్యాలెంట్ హంట్‌లో విజేతగా నిలిచాడు. అప్పటి నుంచి పూర్తిస్థాయి నటుడిగా రాణిస్తున్నాడు.

396
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles