గడ్డం మంచిదే!


Sun,February 17, 2019 01:36 AM

క్లీన్‌గా షేవ్ చేయడం పాత ఫ్యాషన్.. రఫ్‌లుక్‌లో గడ్డంతో కనిపించడమే లేటెస్ట్ ఫ్యాషన్. గడ్డం పెంచడమే ఓ ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియా వేదిగా గడ్డం గ్యాంగ్‌ల గ్రూపులు ఎక్కువగానే ఉన్నాయి. అయితే.. గడ్డం ఫ్యాషన్ కోసం పెంచినా.. ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు పరిశోధకులు.
Good-Beard
గడ్డం బాబులూ.. ఇక హ్యాపీగా గుబురు గడ్డాన్ని పెంచేసుకోవచ్చు. ఇలా పెంచడం ఆరోగ్యానికి కూడా మంచిదే అని చెబుతున్నారు పరిశోధకులు. గడ్డం పెంచుకోవడం వల్ల అనేక చర్మవ్యాధుల నుంచి దూరం కావొచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు నేరుగా ముఖంపై పడవు. దీనివల్ల చర్మం నల్లగా మారడం, సూర్యరశ్మి తగిలి కమిలిపోవడం వంటి సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. గడ్డం పెంచడం వల్ల ముడతలు కూడా రావట. ఇక ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్స్‌కి కారణమయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్ లోపలికి వెళ్లకుండా గడ్డం నివారిస్తుంది. క్లీన్‌గా షేవ్ చేసుకున్న ప్రతీసారి చర్మం మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు, మొటిమలు పెరుగుతాయి. గడ్డం ఉండడం వల్ల ఈ సమస్యలు తలెత్తవు. ముఖంపై మచ్చలుకూడా చాలావరకూ తగ్గుతాయట.

420
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles