గంధంతో అందం


Tue,February 19, 2019 12:29 AM

గంధం ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచి ఔషధం. దీనిని వాడితే చర్మం తళతళా మెరిసిపోవడం ఖాయం. చాలా రకాల సబ్బులు గంధాన్ని తమ ఉత్పత్తుల్లో వాడుతాయి. దీనితో సౌందర్యాన్ని ఎలా పొందవచ్చో చూద్దాం.
sandalwood-face-pack
-గంధపు చూర్ణాన్ని బొల్లి మచ్చలు ఉన్న ప్రాంతాల్లో రాసుకోవాలి.
పది నిమిషాల తర్వాత నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం అందంగా మారుతుంది.
-పాలు, గంధాన్ని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖానికి మంచి కాంతి వస్తుంది.
-రోజూ పసుపు, గంధం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మెటిమలు తగ్గుముఖం పడుతాయి.
-బకెట్ నీటిలో కొంచెం గంధపు నూనె కలుపాలి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవు.
-గంధపు నూనె, ఆలివ్ ఆయిల్‌ని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. వారానికి మూడు సార్లు ఇలా చేస్తే చర్మం మృధువుగా తయారవుతుంది.
-గంధం,కర్పూరం రెండింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మొటిమలు తగ్గుముఖం పడుతాయి.

702
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles