క్రెడాయ్ యూత్‌కాన్ 2019


Sat,February 9, 2019 01:44 AM

న్యూఢిల్లీలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే క్రెడాయ్ యూత్‌కాన్ 2019 జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు నూట యాభై మంది దాకా డెవలపర్లు పాల్గొంటున్నారని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు. క్రెడాయ్ వరంగల్, నిజామాబాద్, మంచిర్యాల్, కొత్తగూడెం, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ వంటి పట్టణాలకు చెందిన డెవలపర్లు పాల్గొంటున్నారని చెప్పారు. ఒక్క హైదరాబాద్ నుంచే సుమారు వందకు పైగా డెవలపర్లు పాల్గొంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది యువ డెవలపర్లను ఉద్దేశించి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 13వ తేదీ ఉదయం ప్రసంగిస్తారని అన్నారు. భారత నిర్మాణ రంగంలో సరికొత్త ఊపిరిలూదేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి పియూష్ గోయల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి తదితరులు ప్రసంగిస్తారని చెప్పారు.

265
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles