క్రెడాయ్ నాట్‌కాన్.. ఈసారి ఇజ్రాయేల్‌లో..


Sat,February 2, 2019 12:04 AM

ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో క్రెడాయ్ నాట్‌కాన్ 2019 నిర్వహిస్తున్నామని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి ప్రకటించారు. నాట్‌కాన్ ఏర్పాట్లను పరిశీలించడానికి ఇజ్రాయెల్ పర్యటించిన అనంతరం ఆయన నమస్తే సంపదతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. దేశంలోని అనేక రాష్ట్రాలు పోటీపడితే, ఈసారి నాట్‌కాన్ 2019ను నిర్వహించే అవకాశం క్రెడాయ్ తెలంగాణకు దక్కిందన్నారు. మనకు తోడ్పాటును క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అందజేస్తుందన్నారు. అందుకే, ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే సుమారు 250 మందికి పైగా డెవలపర్లు ఈసారి ఇజ్రాయెల్ సదస్సుకి విచ్చేస్తారని వెల్లడించారు. ఏర్పాట్లను పరిశీలించడానికి ఇటీవల ఇజ్రాయెల్‌కు వెళ్లినవారిలో క్రెడాయ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి చెరుకు రామచంద్రారెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, సుధాకర్ తదితరులున్నారు.

330
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles