క్యారెట్ రసంతో ముఖకాంతి


Fri,May 10, 2019 01:36 AM

క్యారెట్ ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా దివ్యమైన ఔషధం. సీజన్‌తో సంబంధం లేకుండా లభించే క్యారెట్‌తో ముఖకాంతిని పొందండిలా..
carrat-face-pack
-క్యారెట్‌లో బీటా కెరోటిన్లూ, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు చర్మానికి మెరుపును కూడా ఇస్తాయి. క్యారెట్ తినడం వల్ల కందిపోయిన చర్మం కాంతివంతంగా మారుతుంది.
-నాలుగు స్పూన్ల క్యారెట్ జ్యూస్ రెండు స్పూన్ల బొప్పాయి జ్యూస్, అందులో కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట సేపటి తర్వాత నీళ్లతో కడిగేస్తే చాలు మెరిసే ముఖ సౌందర్యం మీ సొంతమవుతుంది.
-క్యారెట్ యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటి పండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై పూసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై ముడతలు పోతాయి.
-కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖంపై జిడ్డు పోనేపోదు. అలాంటి వారు ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే ముఖం తాజాగా మారుతుంది.
-ముఖంపై మొటిమలు ఉన్న వారు రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే మొటిమలు తొలిగిపోతాయి. ఇలా క్రమం తప్పకుండా వారం పాటు చేస్తే ముఖం తేజస్సు మెరుగుపడుతుంది.

302
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles