క్యాన్సర్.. చిరునవ్వును చెరుపలేకపోయింది..


Sun,March 3, 2019 12:49 AM

క్యాన్సర్ ఉంటే బాధపడాలా? రోజులు లెక్కబెట్టుకుంటూ కూర్చోవాలా? అవన్నీ కాదు.. ఆత్మస్థయిర్యం, బతుకు మీద ఆశ ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చు అని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా మరో మహిళ క్యాన్సర్‌కు భయపడకుండా జీవనం సాగిస్తున్నది. కాన్సర్ బాధితుల్లో జీవితంపై నమ్మకాన్ని నింపుతున్నది.
Pellichupulu
కేరళకు చెందిన నవీ ఇంద్రన్ పిైళ్లెకి క్యాన్సర్. అంతా అయిపోయింది.. ఇక నాకు ఈ భూమ్మీద చోటు లేదు.. చావు సమీపిస్తున్నది అనుకుంటూ మొదట్లో బాధపడేది. కానీ, కొన్ని రోజులకే వాటి నుంచి బయటకు వచ్చి అద్భుత ప్రపంచాన్ని చూస్తున్నది. తనకు తాను ఓ ఆత్మస్థయిర్య చిహ్నంగా చూసుకుని రోజులను ఆనందంగా గడుపుతున్నది. కేవలం తను ఒకతే కాదు. తనలాంటి బాధితులు కూడా క్యాన్సర్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదంటున్నది. వారి కోసం వినూత్నంగా ఆలోచించింది. తను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఏమాత్రం కనిపించకుండా వధువు దుస్తుల్లో ముస్తాబై, చిరునవ్వులతో ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూస్తే తనకు క్యాన్సర్ ఉన్నట్టు అస్సలు కనిపించని విధంగా ఉంది.

తేజోవంతమైన కండ్లు, పెదాలపై చిరునవ్వు, మొహంలో ఎంతో ఆత్మవిశ్వాసం, అన్నిటికన్నా క్యాన్సర్‌నే జయించగలను అన్న నమ్మకం కనిపిస్తాయి. అయితే గత కొన్నేండ్లుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతుండేది. ఈ ఐదేండ్ల వ్యవధిలో లివర్, వెన్నెముకకు కూడా క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత కీమో థెరఫీ ద్వారా చికిత్స పొందినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి ఆమె క్యాన్సర్ వ్యాధి వల్ల కలిగే బాధలను లెక్క చేయకుండా తన ప్రపంచంలో తాను బతకడం ప్రారంభించింది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టింది. క్యాన్సర్ వల్ల ఇబ్బందులు కలిగినా నా నవ్వును మాత్రం క్యాన్సర్ వ్యాధి చెరుపలేదు అంటూ పిళ్లె చెబుతున్నది. ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండేందుకే ఆమె ఇష్టపడుతున్నది. పెళ్లి కూతురిగా తనను తాను చూసుకోవాలనే కోరికతో ముస్తాబై సంబురపడింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఉంచడంతో నెటిజన్లు ఆమె ఆత్మస్థయిర్యంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

290
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles