కోసిన తర్వాత.. రంగు మారకుండా..


Sun,March 17, 2019 12:18 AM

యాపిల్ కోసినప్పుడు అందంగా కనిపిస్తుంది. కానీ, కాసేపటికే రంగు మారుతుంది. కేవలం ఆ ఒక్క పండే కాదు.. ఆక్సిడేషన్ కారణంగా చాలా పండ్లు కోసిన తర్వాత ఇలా రంగు మారిపోతుంటాయి. అలా కాకుండా ఉండేందుకే ఈ చిట్కాలు.
colour
-పండ్లను కొసేముందు కడుగుతారు కదా! అదే నల్లా కింద పండ్లను ఉంచి నీళ్లు పడుతున్నప్పుడే కోస్తే ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపవచ్చు. ఇలా చేస్తే పండ్లు రంగు మారకుండా తాజాగా ఉంటాయి.
-అల్లం ద్రావణం దొరుకుతుంది. అందులో కట్ చేసిన పండ్లను వేయవచ్చు. అల్లంలో ఉండే సెట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలిపి వేస్తుంది. అందుకే పండు రంగు మారకుండా ఉంటుంది.
-ఒక గిన్నెలో కోసిన పండ్లను వేయాలి. కొన్ని నీళ్లలో అర టీస్పూన్ ఉప్పు కలుపాలి. ఆ నీళ్లలో ఈ పండ్లను వేసి రెండు నిమిషాలు ఉంచి తీసేస్తే సరి. పండ్లు రంగు మారకుండా ఉంటాయి.
-ఆస్కార్బిక్ ఆమ్లంలో విటమిన్-సి ఉంటుంది. ఈ యాసిడ్ ఫుడ్‌స్టోర్‌లో కూడా కనిపిస్తుంది. ఈ యాసిడ్ నీటిలో సులభంగా కరిగి పండ్లను రంగు మారకుండా అడ్డుకుంటుంది.
-గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ తేనె వేసి కలుపండి. ఇందులో కోసిన పండ్ల ముక్కలను వేసి 30సెకన్ల తర్వాత బయటకు తీయండి. ఇలా చేస్తే సుమారు 8గంటల వరకు పండ్ల ముక్కలు రంగు మారకుండా తాజాగా ఉంటాయి.
-నీళ్లలో నిమ్మరసం లేదా పైనాపిల్, ఆరెంజ్ జ్యూస్‌ల్లో పండ్ల ముక్కలు కాసేపు ఉంచి తీసినా పండ్లు రంగు మారకుండా ఉంటాయి.

384
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles