కొమ్ముల రాక్షసబల్లి


Tue,March 5, 2019 03:10 AM

శాఖాహార తరగతికి చెందిన కొత్త జాతి రాక్షసబల్లి (డైనోసార్) శిలాజాలను లుప్తజంతు శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. సుమారు 730 లక్షల సంవత్సరాల కిందట ఇవి భూమిపై సంచరించి ఉంటాయని వారు భావిస్తున్నారు.
Purajantu
లక్షలు, కోట్ల సంవత్సరాల కిందట భూమిని ఏలిన రాక్షసబల్లి జాతుల శిలాజాలు ఇబ్బడి ముబ్బడిగా వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక కొత్త జాతి అవశేషాలు బయటపడ్డాయి. సుమారు 73 మిలియన్ (730 లక్షల) సంవత్సరాల కిందట ప్రత్యేకించి అమెరికాకు చెందిన అరిజోనా కొండ ప్రాంతాలలో సంచరించినట్లుగా భావిస్తున్న కొమ్ముల రాక్షసబల్లికి చెందిన కొత్త జాతి శిలాజ భాగాలను పురాజంతు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఈ జంతువులు ఒక్కోటి సుమారు 750 కేజీల బరువు, 11 అడుగుల పొడవుతో ఉండేవని, అంత భారీ శరీరాలతో ఉన్నప్పటికీ ఇవి శాఖాహార జంతువులుగానే మనుగడ సాగించినట్టు తెలుస్తున్నదని వారు అంటున్నారు. క్రిట్టెండెన్సెరేటోప్స్ క్రిజనోస్కీ (Crittendenceratops krzyzanowskii) గా పేరు పెట్టిన ఈ డైనోసార్స్ రెండింటి అవశేషాలు ఆగ్నేయ అరిజోనాలోని ఫోర్ట్ క్రిట్టెండెన్ ఫార్మేషన్ భూభాగంలో లభ్యమైనట్టు వారు చెబుతున్నారు. కాగా, న్యూ మెక్సికో మ్యూజియమ్ ఆఫ్ నేచురల్ హిస్టరీ అండ్ సైన్స్ బులెటిన్‌లో ఈ పరిశోధనా పత్రం త్వరలో ప్రచురితం కానున్నది.

234
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles