కొబ్బరితో కోట్ల వ్యాపారం చేస్తున్న కావ్యానాగ్


Mon,March 25, 2019 01:42 AM

కొబ్బరి అంటేనే కల్పవృక్షం. కొబ్బరికాయ, నీరు, మట్ట, చెట్టు ఇలా కొబ్బరితో ప్రయోజనాలెన్నో. కొబ్బరి నూనెను తలకు రాసుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వంటకు కూడా ఉపయోగిస్తారు. వీటికి భిన్నంగా కొబ్బరి నుంచి వచ్చే ముడి పదార్థాలతో బాడీకేర్ ఉత్పత్తులను తయారు చేసి స్వావలంబన సాధించిందో మహిళ. మల్టీ నేషనల్ కంపెనీల ఉత్పత్తులకు ఏమాత్రం తీసిపోని విధంగా తన ఉత్పత్తులను తయారు చేస్తూ, మార్కెటింగ్ చేస్తూ లాభాలను గడిస్తున్నది. కోకోనెస్ ఉత్పత్తుల పేరుతో వ్యాపార మార్కెట్లోకి ప్రవేశించి విజయాలు సాధిస్తున్న బెంగళూరుకు చెందిన కావ్యానాగ్ సక్సెస్‌మంత్ర.
COCO
రెండు దశాబ్దాల క్రితం వరకూ చాలామంది వంట ల్లో కొబ్బరినూనెనే వాడారు (కేరళ, కర్నాటక ). అయితే అందులో ఉండే హైలెవల్ శాచురేషన్ ఫ్యాట్ కారణం గా.. కోకోనట్ ఆయిల్‌కు ప్రత్యామ్నాయంగా వేరే నూనెలు రంగప్రవేశం చేశాయి. కొబ్బరినూనెలోని ఇతర విలువల కారణంగా.. పర్సనల్ కేర్ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఇండస్ట్రీలో 90 శాతం మారికో బ్రాండ్ అయిన ప్యారాచూట్ ఆక్రమించిందంటేనే దానికున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు.

ప్రస్థానం సాగిందిలా

కావ్యానాగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకున్నప్పుడు ఆమె ఫ్రెండ్ ఒకరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ గురించి చెప్పారు. నిజానికి మామూలు కొబ్బరి నూనె అందరికీ తెలిసిందే. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను ఓ బ్రాండ్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చింది మాత్రం ఫిలిప్పైన్స్ దేశం. ఆ కంట్రీ తయారు చేసిన వర్జిన్ కోకోనట్ ఆయిల్‌కు యూఎస్‌లో ఉన్న క్రేజ్ గురించి కావ్యకు ఆమె ఫ్రెండ్ చెప్తుంటే విని ఆశ్చర్యపోయింది. అమ్మకాల గురించి కంటే ఎండు కొబ్బరి నుంచి కాకుండా పచ్చి కొబ్బరి నుంచి ఈ ఆయిల్ ఎలా తయారు చేస్తారనే అంశం కావ్యకు ఎక్కువ ఆసక్తి కలిగించింది. ఆ ఆసక్తి ఆలోచనగా మారి 2012లో కావ్యానాగ్ చేత కోకోనెస్‌ను ప్రారంభించేలా చేసింది. అలా బెంగళూరుకు దగ్గర ఉండే సింగసండ్రలోని ఓ ప్రశాంతమైన ఫామ్‌లో కోకోనెస్ ప్రారంభమైంది.

తొలి అడుగు

సాధారణంగా ఒక కొత్త వ్యాపారం ప్రారంభిస్తామనగానే చాలామంది లాభనష్టాలను గురించి చర్చిస్తూ నిరూత్సాహపరుస్తారు. కానీ, కావ్యానాగ్‌కు మాత్రం ఆమె స్నేహితులు, కుటుంబసభ్యుల ప్రోత్సాహం బాగా లభించింది. 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మార్కెట్లోకి కోకోనెస్ తొలి అడుగు వేసింది. అనతికాలంలోనే కోకోనెస్ తన సత్తా చాటగా.. కంపెనీ టార్గెట్ గురించి కాకుండా.. అప్పటిదాకా మార్కెట్లో ఉన్న అన్ని కోకో ప్రొడక్టులకు భిన్నంగా పూర్తి సేంద్రియ ఉత్పత్తులుగా.. హైక్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేయడమే తన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

సరైన పద్ధతిలో...

తన సొంత ఫామ్‌లో కొబ్బరికాయల నుంచి నూనె తీసి కొన్ని ప్రయోగాలు చేయగా.. వాటి రిజల్ట్స్ కావ్యను ఆశ్చర్యపరిచాయి. ఉత్పత్తి అయిన ఆయిల్ మార్కెట్లో లభిస్తున్న నూనెలకన్నా తేలికగా.. క్లియర్‌గా ఉండగా.. బాగా పండిన కొబ్బరి వాసన వెదజల్లడం గమనించారు. అలా తీసిన కొబ్బరి నూనె రిఫైనింగ్, బ్లీచింగ్, డీ ఓడరైజింగ్ పద్ధతుల్లో ఫంగస్, మురికి నుంచి కోప్రాను వేరు చేయడం ప్రారంభించారు. సాల్వంట్ ఎక్స్‌ట్రాక్ట్ పద్ధతిలో ఎక్కువ మొత్తం ఆయిల్ తీసేందుకు ఉపయోగపడుతుంది. మంచి క్వాలిటీతో కూడిన ఆయిల్‌ను తయారు చేయాలంటే ఇదే సరైన పద్ధతని చెప్తారు కావ్య. అయితే ఇలా తయారు చేసిన ఆయిల్ పసుపు రంగులో బాగా బరువుగా వచ్చేది.. బాగా ఫ్రై చేసినా వాసన వెదజల్లేది.
COCO1

వర్జిన్ తయారీ..

వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎలా తయారుచేసేవారనే అంశంపై బాగా రీసెర్చ్ చేరు కావ్యానాగ్. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ దగ్గర ఇందుకోసం అవకాశాలున్నా వారు బల్క్ ప్రొడక్షన్ మాత్రమే చేయగలరు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ సంస్థ తమ అవసరాలకు తగినంతగా వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను తయారు చేస్తుందని కావ్యకు తెలిసింది. ఇక అక్కడి నుంచి బిజినెస్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. అందులో పని చేసేవారంతా మహిళలే.. ప్రస్తుతం లభిస్తున్న సింథటిక్ పర్సనల్ కేర్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కోకోనెస్‌ను మార్చారు. కంపెనీ ఉత్పత్తుల తయారీకి కావ్యానాగ్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలనే సంస్థలో నియమించుకున్నారు. కోకోనెస్ ఫామ్‌లో రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ తయారీలా కాకుండా.. వర్జిన్ కోకోనట్ ఆయిల్ పచ్చి కొబ్బరి నుంచే తయారవుతుంది.

ఉత్పత్తులు అమ్మకాలు

రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ తయారు చేసే క్రమంలో చాలా వేస్టేజ్ బై ప్రొడక్టుగా వస్తుండేది. డ్రై కోప్రా నుంచి కోకోనెస్ ఓ హెల్త్ టానిక్ తయారుచేసేది. దాంతో పాటు మహిళల కోసం, పసికందుల కోసం చిన్న చిన్న మొత్తాల్లో మసాజ్ ఆయిల్స్ కూడా తయారు చేసేవారు. తొలిసారి మదర్, బేబీ కేర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేశాం. క్లౌడ్ 9 తో పాటు మెటర్నిటీ బొటిక్స్, ఆన్‌లైన్ రిటైలర్లకు ఇవి సప్లై చేస్తున్నాం అంటారు కావ్య. అమెజాన్ డాట్ కామ్‌లో ఇప్పటికే వారి ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్టు వివరించారు. ప్రస్తుతం నెలకు పది లక్షల టర్నోవర్ టార్గెట్‌గా సాధిస్తున్నది. కోకోనెస్ ప్రొడక్ట్స్‌లో టానింగ్ ఆయిల్స్ ప్రత్యేకించి పాలిచ్చే మహిళల నిపిల్ క్రాక్స్‌ను నివారించే ఆయిల్స్‌తో పాటు.. బేబీ మసాజ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఈ నూనెల తయారీలో వాడే ఔషధాలన్నీ తమ సొంత వ్యవసాయక్షేత్రాల్లోనే పెంచుతారు కావ్యానాగ్.

కుసుమ, దేవమ్మల తోడుగా

ఇదంతా సాధించడంలో కావ్యకు సాయపడుతున్న కుసుమ, దేవమ్మ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. కుసుమకు 14 యేండ్లకే పెళ్లైంది.. నేనప్పటికి టెన్త్ కూడా పాసవలేదు.. కానీ పెళ్లైపోయింది.. ఆ తర్వాత ఇక నా ముగ్గురు పిల్లలను చూసుకోవడమే సరిపోయింది. ఇక్కడకు వచ్చిన తర్వాత హాయిగా ఉంది.. నే చదివిం ది తక్కువైనా.. ఇప్పుడు దానిని ఉపయోగించగలుగుతున్నాను అంటుంది కుసుమ. ఇక దేవమ్మ విషయానికి వస్తే.. ఆమె స్కూల్ మొహమే చూసి ఎరుగదు. అలానే ఇంటి దగ్గర ఉండీ ఉండీ విసుగుపుట్టి మూడేళ్ల క్రితం కావ్య దగ్గరకు వచ్చిందట. కోకోనెస్ ప్రొడక్ట్స్ పై లేబుల్స్ అంటించడం ఆమె పని. అలానే ఆ తర్వాత వాటన్నింటినీ చక్కగా ఓ క్రమపద్ధతిలో అమర్చుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితంలోనే పెద్ద మార్పు వచ్చింది. ఇక్కడెంతో బావుంది చెప్తుంది దేవమ్మ. ఈమె పిల్లలు కూడా దగ్గర్లోనే ఉన్న గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. వాళ్లంతా దేవమ్మ సబ్బులూ నూనెలు తయారు చేస్తుందంటే నమ్మరట. ఎందుకంటే దేవమ్మకి ఎలాంటి చదువూ లేకపోవడమే.

క్వాలిటీలో రాజీపడక

COCO2
హై క్వాలిటీ ప్రొడక్ట్స్‌ను తయారు చేయడం ఒక్కటే కాదు.. మార్కెట్లో స్ట్రాంగ్ బ్రాండ్ బిల్డ్ చేయాలి. మా క్వాలిటీనే మా గురించి చెప్తుంది.. మేం కాదు. మా ప్రొడక్టే మా బ్రాండ్ గురించి.. మా క్వాలిటీ గురించి వాడిన కస్టమరే చెప్పాలి. ఆ స్థాయి కోసమే మేం కష్టపడి పని చేస్తున్నాం. కస్టమర్లకు మేం ఏం ఇవ్వగలమో.. ఎంతవరకూ హై క్వాలిటీతో ఇవ్వగలమో అంతవరకే పని చేస్తున్నాం. అంతేకానీ విపరీతమైన సంఖ్యలో మార్కెట్లోకి భారీగా ఆర్డర్లు దింపేయాలనుకోవడం లేదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాబోం. అదే మా కాన్సెప్ట్ అని చెప్తారు కావ్య.

లక్ష్యంతో ముందుకు

అర్బన్ ఫామ్‌లో కుసుమ, దేవమ్మ ఇద్దరూ ఓ లక్ష్యం ఏర్పరచుకున్నారు. ఈ ముగ్గురు మహిళలూ కలసి కోకోనెస్ బ్రాండ్‌తో అందరిలోకీ చొచ్చుకుపోవడంతో పాటు భారీ ఆదాయం సాధించే దిశగా పని చేస్తున్నారు. కావ్య ఫామ్ హౌస్‌ను చూస్తే.. ఎలక్ట్రానిక్ యంత్రాల రణగొణ ధ్వనులేం వినిపించవు. ప్రశాంతమైన ఆకుపచ్చని ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అక్కడ పని చేస్తున్నంత సేపూ ఇంకా పని చేయాలనే వాతావరణమే ఉంటుంది. దీనికి కావ్య వాళ్లను ట్రీట్ చేసే విధానమే కారణం. అంతా ఓ కుటుంబంలా కలసి ఉండడంతో.. అసలు అదో పనిలా అనిపించదట. ఒక చిన్న ఆలోచన.. కొంత మందికి ఉపాధిని ఇవ్వడంతో పాటు కొత్త మార్కెటును కూడా సృష్టించుకుంటుంది. కావ్యానాగ్ విషయంలో అదే జరిగింది.

1878
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles