కొత్త రకం పాము


Tue,February 26, 2019 01:35 AM

డాలుతోక పాముల్లో ఒక కొత్త జాతిని జంతుశాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. ఏమంత విషపూరితం, భయానకం కాని ఈ పాము పశ్చిమ కనుమలలోని అనైకట్టి హిల్స్‌లో వెలుగుచూసింది.
Snake
పాము తోక అంటే సాధారణంగా మొనదేలినట్లుగా ఉంటుంది. కానీ, మొండిగా వుండే డాలుతోక (Shieldtail) పాముల్లో మూతి భాగం మాదిరిగానే దీని తోకభాగం కూడా మొనదేలకుండా కవచం మాదిరిగా ఉండడం దీని ప్రత్యేకత. కోయంబత్తూరులోని సలీమ్ ఆలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలొజీ అండ్ నేచురల్ హిస్టరీ (సాకోన్) క్యాంపస్‌లో 2018 మేలో వెలుగుచూసిన ఒక కొత్త రకం పామును ఉరోపెల్టిస్ భూపతీ (Uropeltis bhupathi) జాతికి చెందినట్లుగా ప్రకటించారు. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం వారి సహకారంతో పై సంస్థ పరిశోధకులు ఈ అధ్యయనం జరిపారు. ఈ కొత్త జాతి పాము ఉరోపెల్టిస్ కుటుంబానికి చెందినట్లుగా వారు తెలిపారు. ఇందులో సుమారు 50 రకాల జాతులున్నట్లు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా భారతదేశం, శ్రీలంకలలో మాత్రమే కనుగొంటున్నట్టు వారు చెప్పారు. వీటి తోకకొస కెరటినస్ షీల్డ్ (పీచువంటి ప్రొటీన్ పదార్థమైన కెరటిన్‌తో తయారైన డాలు)ను కలిగి ఉంటుంది. కనుకే, వాటికి ఆ పేరు వచ్చింది. కాగా, దివంగత ప్రముఖ భారతీయ హెర్పెటొలజిస్ట్ డా॥ సుబ్రమణ్యన్ భూపతి పేరుమీద పై కొత్త జాతికి ఉరోపెల్టిస్ భూపతిగా పేరు పెట్టినట్లు చెబుతున్నారు. కాగా, ఈ పరిశోధన జూటాక్సా (Zootaxa) సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమైంది.

751
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles