కొత్త జాతి కప్ప


Tue,March 5, 2019 03:09 AM

-బురదగుంట పొట్టి కప్పలలో ఒక కొత్త జాతిని జంతుశాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇథియోపియాలోని ఒక ఏకాకి పర్వత ప్రదేశంలో వారు దీనిని గుర్తించారు.
Jantu
తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా దేశానికి చెందిన బిబిటా మౌంటేన్ ప్రాంతంలో న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబీ పరిశోధకులు ఇటీవల ఒక కొత్త రకం పొట్టి బురదగుంట కప్ప (dwarf puddle frog) ను కనిపెట్టారు. పరిశోధనలకు దూరంగా, పూర్తి ఏకాకిగా ఉన్న ఈ పర్వత ప్రాంతం అత్యంత విభిన్నమైన జీవావరణానికి నెలవుగా పేర్గాంచింది. ప్రైనోబాట్రాచస్ బిబిటా (Phrynobatrachus bibita) గా పిలుస్తున్న ఈ కప్ప చిన్న సైజులో సొగసుగా ఉన్నట్టు వారు ప్రకటించారు. మగకప్ప 1.7 సెం.మీ., ఆడకప్ప 2 సెం.మీ. పరిమాణంలో ఉన్నాయని, వీటి చేతివేళ్లు, కాలివేళ్లతోపాటు కాళ్లుకూడా పొడవుగా ఉన్నట్లు వారు తెలిపారు.

బంగారువర్ణంలో వున్న ఈ జాతికప్పలను ఇప్పటి వరకు తాము చూడలేదని వారంటున్నారు. బిబిటా పర్వతప్రాంతంలో 2016లోనే ఒకసారి తాము అన్వేషణ జరిపామని, అప్పుడు ఎలాంటి కొత్త జాతులూ లభించలేదని, ఈసారి కొత్త మార్గం గుండా కొండమీది మరింత ఎత్తయిన ప్రదేశానికి చేరుకొనగా, అక్కడ దీనిని కనుగొన్నామని వారు పేర్కొన్నారు. బిబిటా పర్వత ప్రదేశమంతా ఒక విలక్షణ, విభిన్నమైన జీవావరణకు నెలవుగా ఉందని, అక్కడ మరెన్నో మనకు తెలియని నూతన జాతులు ఉండి ఉంటాయని భావిస్తున్నామని వారు వివరించారు. కాగా, ఈ పరిశోధనా ఫలితాలు జూకీస్ (ZooKeys) పత్రికలో ప్రచురితమైనాయి.

236
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles