కొత్త ఎమోజీ


Tue,February 12, 2019 01:15 AM

పీరియడ్ వచ్చింది అని చెప్పేందుకు సంకోచిస్తుంటారు చాలామంది. ఆఫీస్‌లో తెలియచేయాలన్నా కష్టమే. అలాంటి వారికోసం వచ్చిందో కొత్త ఎమోజీ!
emoji
2017లో ప్లాన్ ఇంటర్నేషనల్ యూకే 18 నుంచి 34 యేండ్ల వయసు ఆడపిల్లల మీద ఒక సర్వే చేపట్టింది. వాళ్లలో చాలామంది తమ పీరియడ్ సంగతి చెప్పేందుకు చాలా సంకోచించారు. స్నేహితులు, బంధువులు, పార్టనర్‌లకి కూడా ఈ విషయాన్ని పంచుకోనేందుకు ఆలోచించారు. ఇక అలాంటి వాళ్లు ఆఫీసుల్లో ఈ విషయాన్ని చెప్పాలంటే మరింతగా ఆలోచించడం ఖాయం. ఇలాంటి బాధలను తగ్గించేందుకు వచ్చింది ఒక ఎమోజీ! నీటి బిందువులా ఉండే ఎర్రటి రక్త బిందువు.. దాని వెనుక భాగం లేత నీలం రంగులో ఉంటుంది. వెనుక ముదురు నీలి రంగు తరగలు, నీటి బిందువులు, నక్షత్రాలు మెల్లగా కిందికి రాలుతూ ఉంటాయి. వీటన్నింటినీ కలిపిన గ్రాఫిక్ ఇంటర్‌ఛేంజ్ ఫార్మట్ (జిఫ్) రక్తబిందువు ఎమోజీగా తయారుచేశారు. దీని పేరు పీరియడ్ ఎమోజీఅని పెట్టారు. నేను ప్యాడ్‌డేస్‌లో ఉన్నాను అని ఫోన్‌లో సంకేతం పంపించేందుకు వాడే ఎమోజీ అన్నమాట. మార్చి నెలలో ఎమోజీని విడుదల చేస్తారని సమాచారం. మార్కెటోలోకి వచ్చే కొత్త ఫోన్‌ల ఎమోజీ జాబితాలో ఇది కూడా ఉంటుంది. అమెరికాలో ఎమోజీలను డిజైన్ చేసేవారు దీన్నే ఎంపిక చేశారు. ఇలాంటి విషయాన్ని ఎమోజీల రూపంలో డిజైన్ చేసిన తీరుపై కొంతమంది మండిపడుతున్నారు. దీన్ని కచ్చితంగా మగవారే చేసుంటారని విసుక్కుంటున్నారు. ఏదైతేనేం మార్చిలో ఈ ఎమోజీ రావడం మాత్రం ఖాయం.

733
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles