కొత్తగా ఉద్యోగంలో చేరారా?


Wed,March 13, 2019 01:15 AM

కొత్తగా జాబ్‌లో చేరిన ఉద్యోగులు మొదట్లో కొన్ని రోజులు బెరుకుబెరుకుగా ఉంటారు. అలాంటి వారు విధిగా కొన్ని సూచనలు, చిట్కాలు పాటించడం వల్ల ఆ బెరుకును అధిగమించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో
ఓసారి చూద్దాం.

employ
-పని గురించిన రకరకాల విషయాలు, నియమ నిబంధనలు ముందుగానే స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే ఆ వాతావరణంలో బాగా పని చేయగలుగుతారు.
-ఆఫీస్ మీటింగ్స్ తప్పకుండా హాజరవ్వాలి. పనిచేసే విభాగం మాత్రమే కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఇతరులతో కూడా కలివిడిగా మాట్లాడడం అలవర్చుకోవాలి.
-దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చూసేవారికి మంచి ఇంప్రెషన్ కలుగాలి. ఆఫీసులో వ్యక్తులతో మిమ్ములను మీరే పరిచయం చేసుకోవాలి. తోటి ఉద్యోగులతో సంభాషించాలి. స్నేహపూరితంగా మెలుగాలి. కొన్ని విషయాల పట్ల చర్చించడం వంటివి చేస్తుండాలి.
-వర్క్ విషయంలో ఎప్పుడు ఎలాంటి సందేహం వచ్చినా కొలీగ్స్‌ని అడిగి తెలుసుకోవాలి. టీమ్ మీటింగ్‌లో మీ ఆలోచనల్ని, అభిప్రాయాల్ని చెప్పడానికి సంకోచించవద్దు. ముఖ్యంగా గతంలో చేసిన ఉద్యోగంతో కొత్తగా చేరిన ఉద్యోగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పోల్చవద్దు. ఏదైనా సమస్య ఉంటే బాస్‌తోనే మాట్లాడి పరిష్కరించుకోవాలి.
-బాస్‌తో అయినా, సహోద్యోగులతో అయినా ఏం చెప్పాలనుకున్నా.. బిడియం లేకుండా చెప్పాలి. సలహాలు సూచనలు పంచుకుంటే మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

577
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles