కేసీఆర్ వినిపించిన పద్యం!


Fri,February 15, 2019 01:32 AM

Padyneeti
కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణనిచ్చే నిమిత్తం రిసోర్స్ పర్సన్లతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ, తన కంఠతా చదివి వినిపించిన పద్యాలలో సుమతీ శతకంలోని ఈ పద్యమొకటి. అవినీతి, నిర్లక్ష్యాలకు పాల్పడే వారిని కఠినంగా ఎదుర్కోవాలే తప్ప మెత్తటి మాటలు వారివద్ద పనిచేయవని ఉద్బోధిస్తూ దీనిని ఉదాహరణగా చెప్పారాయన. భయం ఉన్నప్పుడే అలాంటి వారు సక్రమంగా పనిచేస్తారని, కాబట్టి అలాంటి వారి విషయంలో నిక్కచ్చిగా ఉండమన్నది ఆయన ఉద్దేశం.

పసిపిల్లలకు పాలు తాగించడానికి నయాన (మెత్తగా, మృదువుగా) మాట్లాడితే కుదరదు. వారు వినరు కూడా. ఏదో రకంగా భయపెట్టి తాపిస్తే మాత్రం ఠక్కున తాగేస్తారు. భయపెడితే పాలే కాదు, విషాన్నయినా వారు గ్రక్కున మింగేస్తారు. దీన్నిబట్టి ఏం అర్థమవుతున్నదంటే, మెత్తని మాటలు అటువంటి పిల్లల దగ్గర చెల్లవు. అలాంటి వారిని మన దారిలోకి తెచ్చుకోవడానికి భయమే సరైన ఆయుధమని సుమతీ శతకకారుడు వెల్లడించిన నీతి పద్యమిది.

546
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles