కేటీఆర్ ప్రోత్సాహం వల్లే..


Wed,January 23, 2019 01:29 AM

Nanda-Sandilya-Ktr
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యేందుకు న్యూజెర్సీకి 2015 మే 25న వచ్చారు. అప్పుడు మంత్రి కేటీఆర్ గారికి మా ప్రాజెక్టు గురించి వివరించాం. తర్వాత ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ సార్ అందరూ సహకరించారు. అలా మిషన్ స్మార్ట్‌రైడ్‌ను తెలంగాణలో మొదలు పెట్టాం. యాప్ వాడకం పెరుగుతున్నది. హైదరాబాద్‌లో అన్ని హోటళ్లు, బార్లలో మిషన్ స్మార్ట్ రైడ్ గురించి ప్రచారం చేస్తున్నాం. హైదరాబాద్‌లో ఏటా 380 నుంచి 400 మంది కేవలం మద్యం సేవించి డ్రైవ్ చేయడంతోనే ప్రాణాలు కోల్పోతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ ప్రాణాలు కాపాడితే నాలుగు వందల కుటుంబాలకు మేలు చేసినట్లే కదా. ఈ రెండేండ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ప్రమాదాలు 38 శాతం వరకు తగ్గాయి. అవగాహన కోసం ఓ యాడ్ ఫిల్మ్ తీశాం. దీన్ని అన్ని సినిమా హాల్స్‌లో ప్రదర్శించాలని హైదరాబాద్ సిపీ అంజనీ కుమార్ గారు ఉత్తర్వులు కూడా ఇచ్చారు.

578
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles