కేక్‌ల వేడుక!


Wed,December 26, 2018 10:52 PM

డిసెంబర్ 31 అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే.. ప్రతీ ఇంట్లో చిన్న కేక్ అయినా కట్ చేయాల్సిందే! బయట నుంచి తెచ్చే వాటిని కట్ చేయడం.. మరుసటి రోజు బయట పడేయడం చేస్తుంటారు.. అదే ఇంట్లో చేసిందయితే టేస్టీగా.. మరుసటి రోజుకుఫ్రెష్‌గా ఉంటుంది.. అందుకే ఈ కొత్త సంవత్సరం స్వాగతానికి.. హోమ్ మేడ్ కేక్‌లతో వేడుక చేయండి..
Orange-Plum-Cake

ఆరెంజ్ ప్లమ్ కేక్

కావాల్సినవి : మైదా : ఒక కప్పు, జీడిపప్పులు : 10, కిస్‌మిస్ : 10, బాదం పప్పులు : 10, టూటీ ఫ్రూట్స్ : ఒక టేబుల్‌స్పూన్ (రెడ్, గ్రీన్ ), చెర్రీస్ : ఒక టేబుల్‌స్పూన్, బేకింగ్ పౌడర్ : 3/4 టీస్పూన్, చక్కెర పొడి : ఒక కప్పు, ఆరెంజ్ జెస్ట్ : పావు టీస్పూన్ , ఆరెంజ్ జ్యూస్ : ఒక కప్పు,
వెనీలా ఎసెన్స్ : ఒక టీస్పూన్ , కోడిగుడ్లు : 3, నూనె : అర కప్పు


తయారీ : స్టెప్ 1 : బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లను చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా వేసి వీటన్నిటినీ వేయాలి. ఇందులోనే టుటీ ఫ్రూటీలు, చెర్రీలు, బేకింగ్ పౌడర్ వేసి కలుపాలి.
స్టెప్ 2 : మరో గిన్నెలో కోడిగుడ్లను గిలక్కొట్టాలి. దీంట్లో చక్కెర పొడి వేసి మరొకసారి కలుపాలి. బాగా కలిపిన తర్వాత ఆరెంజ్ జెస్ట్, ఆరెంజ్ జ్యూస్, వెనీలా ఎసెన్స్ వేసి కలిపి పక్కన పెట్టాలి.
స్టెప్ 3 : ముందు కలుపుకొన్న మైదాలో.. కోడిగుడ్డు మిశ్రమం పోసి ఉండలు కట్టకుండా కలుపాలి. చివరగా నూనె పోసి కలిపి కాసేపు అలాగే ఉంచాలి.
స్టెప్ 4 : ఈలోపు బేకింగ్ ట్రేలో మైదాను కొద్దిగా చల్లి మైదా మిశ్రమాన్ని పోయాలి. 180 డిగ్రీల సెంటిగ్రేడ్స్ వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేయాలి. టేస్టీ కేక్ మీ ముందుంటుంది.


CAPPUCCINO-CAKE

క్యాపిచినో కేక్

కావాల్సినవి : మైదా : 1 1/4 కప్పులు, క్యాస్టర్ షుగర్ : అర కప్పు, కోకో పౌడర్ : ఒక టేబుల్‌స్పూన్, బేకింగ్ పౌడర్ : ఒక టీస్పూన్, బేకింగ్ సోడా : చిటికెడు , కాఫీ పౌడర్ : ఒక టేబుల్‌స్పూన్‌m, వెనీలా ఎసెన్స్ : అర టీస్పూన్, కోడిగుడ్లు : 3, ఐసింగ్ షుగర్ : ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు : పావు టీస్పూన్ , నూనె : 40 మి.లీ.


తయారీ : స్టెప్ 1 : ఒక గిన్నెలో మైదా, చక్కెర, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలిపి పక్కన పెట్టాలి.
స్టెప్ 2 : మరో రెండు గిన్నెల్లో కోడిగుడ్డులోని తెల్లసొన, పచ్చసొన వేరు వేరుగా వేసి పెట్టాలి.
స్టెప్ 3 : చిన్న గిన్నెలో కాఫీపౌడర్ వేసి అర కప్పు వేడి నీళ్లుపోసి కలుపుకోవాలి. దీంట్లో వెనీలా ఎసెన్స్, కోడిగుడ్డులోని పచ్చ సొన, నూనె పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 4 : మరో చిన్న గిన్నెలో కోడిగుడ్డులోని తెల్లసొన, ఐసింగ్ షుగర్ వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు కలిపిన మైదాలో కాఫీపౌడర్ మిశ్రమం, కోడిగుడ్డు తెల్లసొన మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా కలుపాలి.
స్టెప్ 5 : బేకింగ్ ట్రేలో కొద్దిగా మైదా పిండిని చల్లి.. కేక్ మిశ్రమాన్ని పోసి ఉంచాలి. ఆ తర్వాత 180 డిగ్రీల సెంటిగ్రేడ్స్ వద్ద 25 నిమిషాల పాటు బేకింగ్ చేయాలి. రుచికరమైన క్యాపిచినో కేక్ మీ నోరూరించక మానదు.


EGGLESS-CAKE

ఎగ్‌లెస్ కేక్ విత్ డ్రై ఫ్రూట్స్

కావాల్సినవి : మిల్క్‌మేడ్ : 200 మి.లీ., మైదా : 100 గ్రా., బటర్ : 60 గ్రా., పాలు : 30 మి.లీ., వెనీలా ఎసెన్స్ : ఒక టీస్పూన్, నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్, కుకింగ్ సోడా : చిటికెడు, బేకింగ్ పౌడర్ : ఒక టేబుల్‌స్పూన్, వాల్‌నట్ పొడి : ఒక టేబుల్‌స్పూన్,
జీడిపప్పులు : 6, బాదం పప్పులు : 6


తయారీ : స్టెప్ 1 : ఒక గిన్నెలో మిల్క్‌మేడ్, బటర్, పాలు, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : ఇందులో నిమ్మరసం, మైదా, కుకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. జీడిపప్పులు, బాదం పప్పులను చిన్నగా కట్ చేసుకోవాలి.
స్టెప్ 3 : వీటిని మిల్క్‌మేడ్ మిశ్రమంలో వేయాలి. వాల్‌నట్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. బేకింగ్ ట్రేలో బటర్ రాసి ఉంచుకోవాలి.
స్టెప్ 4 : మిల్క్‌మేడ్ మిశ్రమాన్ని వేసి 160 డిగ్రీల సెంటిగ్రేడ్స్ వద్ద అరగంట పాటు బేక్ చేయాలి.


MANGO-SPONGE-CAKE

మ్యాంగో స్పాంజి కేక్

కావాల్సినవి : మ్యాంగో పల్ప్ : అర కప్పు
బటర్ : 30 గ్రా., చక్కెర : 20గ్రా.
కోడిగుడ్డు : 1,మైదా : అర కప్పు
వెనీలా ఎసెన్స్ : అర టీస్పూన్
బేకింగ్ సోడా : చిటికెడు
బేకింగ్ పౌడర్ : చిటికెడు
గోధుమ పిండి : ఒక టేబుల్‌స్పూన్
రవ్వ : ఒక టేబుల్‌స్పూన్
కోకో చిప్స్ : 2 టేబుల్‌స్పూన్స్


తయారీ : స్టెప్ 1 : గిన్నెలో బటర్, చక్కెర వేసి బాగా గిలక్కొట్టాలి. ఇందులో కోడిగుడ్డును గిలక్కొట్టి కలిపి పెట్టుకోవాలి.
స్టెప్ 2 : దీంట్లో మ్యాంగో పల్ప్, వెనీలా ఎసెన్స్ వేసి కలిపి పక్కన పెట్టాలి.
స్టెప్ 3 : మరో గిన్నెలో మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, గోధుమ పిండి, రవ్వ, కోకో చిప్స్ వేసి కలుపుకోవాలి.
స్టెప్ 4 : దీన్ని మ్యాంగో మిశ్రమంలో వేసి ఉండలు కట్టకుండా కలుపాలి. ఇందులో బటర్ వేసి కలిపి పక్కన పెట్టాలి. బేకింగ్ ట్రేకి బటర్ రాసి 180 డిగ్రీల సెంటిగ్రేడ్స్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేయాలి.
new-year-cake

624
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles