కుక్కపిల్ల కాదు.. ఎలుక!


Sun,December 30, 2018 12:36 AM

పెంపుడు జంతువుల్లో కుక్కల్ని పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడుతారు. ఆ ఇష్టంతోనే ఒక కుక్కపిల్లని తెచ్చి పెంచుకున్నాడు ఓ వ్యక్తి. కొన్ని రోజుల తరువాత చూస్త్తే కుక్క కాస్త ఏమైందో తెలుసా?
unnamed
విశ్వాసం అనగానే గుర్తొచ్చే పేరు శునకం. అలాంటిది ఓ వ్యక్తి బుజ్జి కుక్కపిల్లను పెంచుకునేందుకు తీసుకెళ్లాడట. అయితే కొన్ని రోజులకు అది ఎలుకగా మారిపోయిందని చాలా బాధ పడుతున్నాడు. అతను చైనాకి చెందిన స్మాల్ మౌంటేన్ గ్రామానికి చెందిన వ్యక్తి. తన వీధిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడికి నల్లరంగులో ఉన్న చిన్న జీవి కనిపించింది. అది కుక్కపిల్లగా భావించి ఇంటికి తీసుకెళ్లాడు. విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క అని దానికి ప్రతిరోజూ ఆహారం పెడుతూ పెంచుతున్నాడు. ఎన్ని రోజులు గడిచినా దాని ఆకారం కుక్కగా మారలేదట. దీంతో అనుమానం వచ్చి నల్లనిజీవి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది బ్యాంబూ ర్యాట్ అనే ఓ రకమైన ఎలుకని ఓ నెటిజన్ చెప్పేసరికి యజమాని ఖంగుతిన్నాడు. ఇటువంటి ఎలుకలు దక్షిణ చైనాలో ఎక్కువగా ఉంటాయని నెటిజన్ చెప్పాడు. బ్యాంబూ చెట్లను ఆహారంగా తీసుకున్న కారణంగా వీటిని బ్యాంబూ ర్యాట్స్ అని పిలుస్తారని వివరించాడు. కామెంట్స్‌తో ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి.

344
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles