కీళ్లనొప్పులకు ఆయుర్వేదం


Sun,January 22, 2017 01:38 AM

ayurveda
మోకాళ్ల నొప్పుల వల్ల జీవితం మీద ఆశ సన్నగిల్లుతుంది. నొప్పి భరించలేకుండా ఉన్నపుడు వైద్య చికిత్స తీసుకోవడంలో ఎవరూ నిర్లక్ష్యం చెయ్యరు. కాకాపోతే మోకాళ్లనొప్పులు రావడానికి గల అసలు కారణాన్ని గుర్తించకుండానే జరిగే చికిత్సలే ఎక్కువ. అందుకే అవేవీ ఫలితాలనివ్వడం లేదు. అయితే మోకాళ్ల నొప్పుల మూలాలు తెలిసి వైద్యం చేసేది ఆయుర్వేదం ఒక్కటేనన్నది మాత్రం పరమ సత్యం. కీళ్ల మధ్య వాపును గానీ కీళ్లు అరిగిపోవడం వల్ల కలిగే బాధను గానీ, కీళ్ల వాతం లేదా ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఈ సమస్య వయసు పైబడిన వాళ్లకే వస్తుందని ఇది వరకు అనుకునే వారు. కానీ ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. వయసును బట్టి ఈ నొప్పిని విభజించడం మంచిది. వయసు పైబడిన వారిలో వివిధ కారణాల వల్ల కీళ్లు దెబ్బతిని దీర్ఘకాలకంగా అది బాధిస్తూ ఉంటే, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అలా కాకుండా ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల గానీ, రుమటాయిడ్ అర్థరైటిస్ వల్ల గానీ సొరియాసిస్ వల్ల గానీ వచ్చే కీళ్ల సమస్యను ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటారు. ఇవే కాకుండా ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే కీళ్ల సమస్యను సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ 108 రకాలు. ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా వీటిల్లో ప్రధానంగా కనిపించే లక్షణం నొప్పి. ఇది కాలు కదపనీయని నొప్పి, ఎక్కువ సమయం పాటు నిలబడలేని, ఎక్కువ సమయం నడవలేని నొప్పి. ముందు కీళ్లలో ఏదో శబ్ధంతో మొదలయ్యే ఈ కీళ్ల సమస్య క్రమంగా జీవితాన్ని శిథిలావస్థకు చేర్చే స్థితి దాకా తీసుకువెళ్తుంది.

ఎన్నో కారణాలు


కీళ్ల నొప్పులు రావడానికి పరస్పరం పొసగని ఆహారపదార్ధాలను ఏకకాలంలో తినడం ఇందుకు ఒక ప్రధాన కారణం. దీన్నే విరుద్ధాహార సేవనం అంటారు. చేపలు, పెరుగు కొఏ భోజనంలో తినడం ఇలాంటిదే. దీనికి తోడు ఆకలి మందగించడం ఒక ప్రధాన సమస్య. ఆకలి మందగించడం అన్నది కేవలం జీర్ణవ్యవస్థకు సంబంధించినది మాత్రమే కాదు. అది మొత్తం జీవక్రియలన్నీ కుంటుపడడం వల్ల వచ్చిన సమస్య. జీర్ణక్రియ సరిగా లేని వారిలో సహజంగానే విసర్జన క్రియ కూడా సరిగా ఉండదు. ఫలితంగా శరీరంలో వ్యర్థ, విషపదార్ధాలు అంటే ఆమం పేరుకు పోతుంది. ఈ ఆమం కీళ్లలో కూడా పేరుకుపోయినపుడు కీళ్ల వాతం మొదలవుతుంది.

జీర్ణశక్తిని పెంచాలి


శరీరంలో పేరుకు పోయిన వ్యర్ధ విషపదార్థాల వల్ల ఏర్పడే ఆమం, రక్తధాతువులోకి ప్రవేశిస్తుంది. అలా రక్తంతో పయనిస్తూ కీళ్లలో నిలిచిపోతుంది. ఆ తర్వాత కీళ్లను తినేయడం మొదలుపెడుతుంది. రక్తంలోకి ఆమం ప్రవేశించడం వల్ల శరీరంలోని సమస్త కణజాలం తమ విధుల్ని నిర్వర్తించలేకపోతుంది. దానికి తోడు ఈ కణజాలం తమ ధర్మానికి విరుద్ధంగా కూడా వ్యవహరించడం మొదలుపెడుతుంది. శరీరంలో వ్యర్థ పరదార్థాల మోతాదు పెరిగే కొద్దీ కేవలం మోకాళ్లనొప్పులకు, నడుము నొప్పులకు పరిమితం కాకుండా శరీరంలోని సమస్త కీళ్లు దెబ్బతింటాయి. దీనంతటికీ మూల స్థానం జీర్ణాశయమే. జీర్ణక్రియ కుంటుపడి ఆకలి మందగించడమే. చికత్స అంటూ జరిగితే అది జీర్ణాశయానికే జరగాలి. కీళ్ల నొప్పులు లేదా మోకాళ్ల నొప్పులకు మోకాళ్లకు లేదా ఆయా కీళ్లకు చికత్స చేయడానికి పరిమితమవడం వల్ల ఆశించిన ఫలితం రాదు. పైగా సకాలంలో సరైన చికత్సలు అందక సప్తధాతువులు క్షీణిస్తూ వెళ్తాయి. ఇది శరీర వ్యవస్థకు జరిగే భారీ నష్టం ఇవేవీ పట్టించుకోకుండా ఆధునిక వైద్య విధానం సర్జరీలకు, కీళ్ల మార్పిడికి సిద్ధమైపోతోంది. చాలా మంది విషయంలో ఇది అవసరమే అవుతుంది.
srinivas

ఆయుర్వేద విశిష్టత


దోషాలను, మలినాలను తొలగించే శోధన చికిత్సలు ఆయుర్వేదంలో సాధ్యం. అన్నింటికి మించి జానువస్తి చికిత్సలకు ప్రాధాన్యతను ఇస్తుంది. మోకాళ్లనప్పులకు కారణమైన సంధివాతాన్ని తొలగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా శమన చికిత్స ఉంటుంది. ఇది బాహ్య చికిత్స, అభ్యంతర చికిత్స అంటూ రెండు రకాలుగా ఉంటుంది. దీని వల్ల కీళ్లలోని వాపు నొప్పి కీళ్ల అరుగుదల వల్ల తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి. వీటితో చేసే స్నేహం, స్వేదం, లేపం, పరికేశం చికిత్సలతో కీళ్లలో పూర్వ శక్తిని నిండుగా పుంజుకుంటాయి. కీళ్లు, ఎముకలతో పాటు కండరాలు పటిష్టమవుతాయి. శరీరం సర్వశక్తివంతమైన మీ ఉత్సాహానికి అవధులు ఉండవు.

1816
Tags

More News

VIRAL NEWS

Featured Articles