కీలు మార్పిడికి ముందే జాగ్రత్తలు అవసరమా?


Wed,September 6, 2017 01:14 AM

నా వయసు 55 సంవత్సరాలు. బ్యాంకు ఉద్యోగిని. నా బరువు 12 కేజీలు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. నాలుగు నెలల క్రితం ఎడమ మోకాలులో తీవ్రమైన నొప్పి వచ్చి నడవలేని స్థితి ఏర్పడింది. డాక్టర్‌కు చూపించుకుంటే పరీక్షలు చేసి జాయింట్ రీప్లేస్‌మెంట్ చెయ్యాలని సూచించారు. జాయింట్ రీ ప్లేస్‌మెంట్ చేయించుకోవడానికి ఎలాంటి హాస్పిటల్ ఎంపిక చేసుకోవడం మంచిది. దీని గురించిన పూర్తి వివరాలు తెలియజేయగలరు?
నారయణ రావు, జగిత్యాల

Docter
మీరు సర్జరీకి వెళ్లడానికి ముందే అన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నందుకు మీకు అభినందనలు. కీలు మార్పిడి కాస్త క్లిష్టమైన సర్జరీ. సర్జరీ ఫలితాలు సరైన సర్జన్, అన్ని వసతులు కలిగిన హాస్పిటల్ వంటి అనేక కారణాల మీద ఆధారపడి ఉంటాయి. వీటితో పాటు మంచి ఫిజియోథెరపీ సౌకర్యం కూడా అందుబాటులో ఉండాలి.
-హాస్పిటల్‌లో ఎంత తరచుగా కీలు మార్పిడి సర్జరీలు జరుగుతున్నాయి?
-మీ విషయంలో సర్జరీ విజయవంతం అయ్యే అవకాశాలు ఎంత వరకు?
-ఇది వరకు సర్జరీ చేయించుకున్న వారికి సర్జరీ తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని హాస్పిటల్ వారు ఎలా పరిష్కరించారు?

-సర్జన్, ఫిజియోథెరపీ నిపుణులతో ముందుగా మాట్లాడే అవకాశం ఉంటుందా?
-ఇలాంటి సమాచారమంతా ముందుగానే సేకరించుకోవాలి. ఇప్పుడు అధునాతన పద్ధతులు, రకరకాల కృత్రిమ కీళ్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం కీలును మార్చే అవసరం లేకుండా పాక్షిక కీలు మార్పిడి కూడా ఇప్పుడు సాధ్యపడుతున్నది. కాబట్టి ముందుగానే మీ పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అన్ని వివరాలను సేకరించిన తర్వాత మీరు సర్జరీకి ప్రణాళిక రూపొందించుకోవడం మంచిది.
DR;praveen

530
Tags

More News

VIRAL NEWS