కీటో డైట్‌తో భారీ నష్టమే!


Sun,March 10, 2019 12:51 AM

ఒంటిచుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నింటిలో కెల్లా కీటో డైట్‌ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ డైట్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Kitto-Diet
కీటో డైట్ అంటే.. మూడుపూటలా ఆహరం తీసుకోకుండా డ్రై ఫ్రూట్స్, పండ్లు, కూరగాయలు, మాంసాహారం(ఎక్కువగా చికెన్) మాత్రమే తీసుకుంటుంటారు. దీని వలన మంచి ఫలితాలే ఉన్నా.. దీని వలన భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. ఈ కీటో డైట్‌పై చైనాకు చెందిన కార్డియాలజిస్ట్ ప్రముఖ రచయిత సన్ యాట్-సేన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ జుంగ్ ఆధ్వర్యంలో పరిశోధన జరిపారు. దీనివలన భవిష్యత్‌లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. 4,000 మంది ఆహారపు అలవాట్లను రెండు దశాబ్దాల పాటు పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. కీటో ఆహారంలో భాగంగా ధాన్యాలు, పండ్లు, కూరగాయలను తగ్గించడం ద్వారా గుండెకొట్టుకునే వేగం లయతప్పుతుంది. ఇది గుండెపోటు వంటి తీవ్ర అనర్థాలకు దారితీస్తుందని తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు.

414
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles