కిడ్నీలో రాళ్లకు ఆధునిక చికిత్సలు


Tue,May 23, 2017 11:29 PM

చిన్న చిన్న విరామాలతో వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. మూత్రం వీలైనంత వరకు లేత రంగులో ఉండేలా జాగ్రత్త పడాలి. ఏమాత్రం చిక్కబడుతున్నా నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.కిడ్నీలో లేదా యూరీనరీ బ్లాడర్‌లో రాళ్లు అంటే ఖనిజలవణాలు గట్టిగా మారిపోవడం వల్ల ఏర్పడేవి. ఇది ప్రతి 20 మందిలో ఒకరిలో కనిపించే సమస్య.
మూత్ర వ్యవస్థలో ఏర్పడే ఈ రాళ్లు అయితే పైన కిడ్నీలో ఏర్పడుతాయి. లేదా కిందివైపు బ్లాడర్‌లో ఏర్పడుతాయి. ఇవి రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఒక్కో రాయి గట్టిగా ఉండొచ్చు మరోటి కాస్త మెత్తగా ఉండొచ్చు. మూత్రవ్యవస్థ అంతర్గత నిర్మాణం కూడా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది.
redo2pcnl

చికిత్స


-నీళ్లు తగినంత తాగితే చిన్న పరిమాణంలో ఉండే రాళ్లు మూత్రంలో వాటంతటవే పడిపోతాయి. పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లు తొలగించడానికి సర్జరీ అవసరమవుతుంది.
-యూరేటరోస్కోపీ, పెర్కున్‌టేనియస్ నెఫ్రోలిథోటమీ అనే రెండు పధ్ధతులు మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ విధానంలో చేస్తారు. ఈ రెండు విధానాల్లోనూ ఈ రాళ్ళను చిన్న ముక్కలుగా విడదీసేందుకు లేజర్‌ను ఉపయోగిస్తారు. తర్వాత అవి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి.
-యూరెటరోస్కోపీ - యూరేటరోస్కోపీ ద్వారా మూత్రనాళంలో లేదా కిడ్నీలో రాయి ఎక్కడున్న నేరుగా దాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక సన్నని టెలీస్కోప్‌ను మూత్రనాళం ద్వారా లోపలికి పంపడం ద్వారా సహాయంతో మూత్ర వ్యవస్థలో ఉన్న రాళ్లను నేరుగా చూసే అవకాశం ఏర్పడుతుంది. దీనితో పాటు ఉండే ఒక హాల్మియం లేజర్ ఫైబర్ అనే చిన్న పరికరం ద్వారా లేజర్ కిరణాలు పంపి పెద్ద పరిమాణంలో ఉన్న రాళ్లను చిన్నగా విడగొడతారు. తర్వాత సహజంగా జరిగే మూత్ర విసర్జన ద్వారా ఈ రాళ్లు బయటకు వెళ్లిపోతాయి.
-ఈ పద్ధతిలో చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి వెళ్లిపోవచ్చు. వారం రోజుల్లో పనులు కూడా చేసుకోవచ్చు.
-పెర్కున్‌టేనియస్ నెఫ్రోలిథోటమీ (పీసీఎన్‌ఎల్) - ఈ విధానాన్ని కిడ్నీలో పెద్ద పరిమాణంలో రాళ్లు ఉన్నపుడు ఉపయోగిస్తారు. ఈ విధానంలో వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి దానిద్వారా నెఫ్రోస్కోప్‌ను లోపలికి పంపిస్తారు. దీనిలో కూడా పెద్ద రాళ్లను చిన్నవిగా విడదీసేందుకు లేజర్‌ను వినియోగిస్తారు. సర్జరీ తర్వాత 3-5 రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు. సర్జరీ తర్వాత 2-4 వారాల వరకు బరువైన పనులు చెయ్యకుండా ఉంటే చాలు.
chand

జాగ్రత్తలు


కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీమళ్లీ రావచ్చు. కాబట్టి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
-చిన్న చిన్న విరామాలతో వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతుండాలి. మూత్రం వీలైనంత వరకు లేత రంగులో ఉండేలా జాగ్రత్త పడాలి. ఏమాత్రం చిక్కబడుతున్నా నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
-రక్తంలో పెరుగుతున్న లవణాల గాఢత కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
-మాంసాహారం కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే జంతు సంబంధ ప్రొటీన్ మూత్రంలో యూరిక్‌ఆసిడ్ స్థాయినిపెంచుతుంది. ఇది యూరిక్ ఆసిడ్ రాళ్లు ఏర్పడేందుకు దోహదం చేస్తుంది.
-సరిపడినంత కాల్షియం తీసుకోవాలి. కాల్షియం రాళ్లు ఏర్పడే అస్కారం ఉన్నవారు ప్రతి రోజు తప్పనిసరిగా 800 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలి.
-మాంసాహారం తగ్గించి తీసుకోడం మాత్రమే కాదు, తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

665
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles