కాలేయ మార్పిడికి అవగాహన ముఖ్యం


Mon,May 4, 2015 01:27 AM

alcoholic_hepatitis

అవయవదానం మహాదానం. శరీరంలో కొన్ని ప్రధాన అంగాలు పనిచేయకపోవతే ప్రాణానికి ఆపద ఏర్పడుతుంది. అటువంటి అవయవం చేసే పని వేరే అవయవం చేయదు. అటువంటపుడు వేరే శరీరంల నుంచి అదే అవయవాన్ని సేకరించి, ఈ రోగి శరీరంలో అమర్చటాన్ని అవయవదానం అంటారు. ఇటువంటి కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. జీర్ణవ్యవస్థలోని అనుబంధ గ్రంథి అయిన కాలేయం అనేక విధుల్ని నిర్వర్తిస్తుంది. కానీ వీటిని మరొక అవయవం చెయ్యటానికి వీలు కుదరదు. అందుచేత దీనిని కీలకమైన అవయవంగా పరిగణిస్తారు.

జీర్ణవ్యవస్థలో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. జీర్ణాశయానికి కుడివైపున ఇది అమరి ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చెయ్యడంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ప్రొటీన్ సంశ్లేషణ, ఔషధ వినియోగం మలినాల విసర్జన వంటి అనేక జీవన క్రియల్లో ఉపయోగపడుతుంది. కాలేయం చేసే పనుల్ని ఇతర శరీర అవయవాలు చేయలేవు. అందుచేత కాలేయం పాడైతే వెంటనే చికిత్స తీసుకోవాలి. దానికి పరిష్కార మార్గం కనుక్కోవాలి. లేదంటే సమస్య ముదరిపోతుంది. అప్పుడు చింతించి ఉపయోగం ఉండదు.

నిరతరాయంగా పనిచేసే క్రమంలో కాలేయం వ్యాధిగ్రస్తమవుతుంది. ఇందుకు అనేక కారణాల్ని గర్తించారు. వైరల్ ఇన్‌ఫెక్షన్, మధ్యపానం డగ్స్ తీసుకోవడం, క్యాన్సర్, పుట్టుకతో వచ్చే లోపాల వంటివి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. మందులతో కొన్ని సార్లు ఆపరేషన్ చికిత్సలతో వీటిని సరిచేయవచ్చు. పూర్తిగా కాలేయం చెడిపోతే మాత్రం మార్పిడి ఒక్కటే పరిష్కారం అవుతుంది. దీన్నే కాలేయ మార్పిడి అని అంటారు. తుది దశకు చేరిన కాలేయ వ్యాధుల్లో ఇది ఒక్కటే పరిష్కారం. వాస్తవానికి కృత్రిమంగా కొత్త కాలేయాన్ని తయారుచేయడం కుదరదు. ఇది వేరే వ్యక్తి నుంచి సేకరించాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడిలో కాలేయం ఇచ్చే వ్యక్తిని దాతగా, తీసుకునే వ్యక్తిని గ్రహీతగా వ్యవహరిస్తారు.

కాలేయ మార్పిడికి సంంబంధించి అవగాహన చాలా ముఖ్యం. అంటే కాలేయాన్ని ఇచ్చే వారి నుంచి లేక ఇచ్చే వారి కుటుంబ సభ్యుల నుంచి అదే సమయంలో కాలేయాన్ని స్వీకరించే వారు, వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రక్రియ మీద అవగాహన అవసరం. అప్పుడే ఈ ప్రక్రియ సజావుగా పూర్తిచెయ్యడానికి వీలవుతుంది. కాలేయ మార్పిడికి సంంబంధించి అవగాహన చాలా ముఖ్యం. అంటే కాలేయాన్ని ఇచ్చే వారి నుంచి లేక ఇచ్చే వారి కుటుంబ సభ్యుల నుంచి అదే సమయంలో కాలేయాన్ని స్వీకరించే వారు, వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రక్రియ మీద అవగాహన అవసరం. అప్పుడే ఈ ప్రక్రియ సజావుగా పూర్తిచెయ్యడానికి వీలవుతుంది.

మృతదాత కాలేయ మార్పిడి


బ్రెయిన్ డెడ్ వ్యక్తుల్లో కొన్ని సార్లు ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలు పనిచేస్తుంటాయి. సాధారణంగా ఊపిరి ఆగిపోయి, గుండె కొట్టుకోవడం ఆగిపోతేనే ఒకవ్యక్తిని చనిపోయినట్టుగా చెబుతారు. కొన్ని సందర్భాలలో స్ట్రోక్, కపాలంలో రక్తస్రావం వల్ల మెదడు నిర్జివం అయిపోతుంది. దీన్ని బ్రెయిన్‌డెడ్ అంటారు. తర్వాత 48 లేదా 72 గంటల్లో మిగిలిన అవయవాలు కూడా స్థంభించిపోతాయి. ఈ సమయంలో వారినుంచి వివిధ అవయవాలను సేకరిస్తారు. కానీ దీనికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. బ్రెయిన్ డెడ్ అయినట్టుగా కనీసం ఇద్దరు న్యూరాలజిస్టులు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కుటుంబానికి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తి కాలేయ దానానికి అనుమతించాలి. తర్వాత దేహానికి నిర్ధారిత పరీక్షల్ని జరిపించాల్సి ఉంటుంది. రక్తం, కాలేయ ఉపాంగాలు సక్రమంగా లేని పరిస్థితుల్లో అంటే క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నపుడు కాలేయ మార్పిడి వీలుకాదు.

హృదయస్పందన లేని దాతలు


పూర్తిగా చనిపోయిన వ్యక్తి నుంచి కాలేయాన్ని సేకరించడం, చనిపోయిన 20 నిమిషాల్లోపు కాలేయాన్ని సేకరించాలి. అవయవాన్ని భద్రపరచాలి. చట్టబద్ధమైన విధానాల ద్వారా అంటే సాధికారిక వ్యక్తుల సమ్మతి తోనే అవయవాలను సేకరించే అవకాశం ఉంటుంది.

సన్నిహితుల నుంచి సేకరించడం
కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరిస్తారు. తూర్పు దేశాల్లో ఈ విధానాన్ని ఎక్కువగా గమనించవచ్చు. ప్రధానమైన అవయవాన్ని దానం చేయడం గొప్పగా భావిస్తారు. దీన్ని అంతా ఒక ఆదర్శమైన విషయంగా చెబుతారు. ఇవి ఈ మధ్య చాలా విజయవంతం అవుతున్నాయి. దాతకు ఎలాంటి ముప్పులేకుండా దానం చేస్తున్నారు. కాలేయాన్ని దానం చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే కాలేయం సాధారణ స్థితికి చేరుకుంటుంది. కొన్ని వారాల వ్యవధిలోనే తమ పనులు తాము చేసుకోగలుగుతారు. చట్టప్రకారం కుటుంబంలోని సన్నిహితుల దగ్గర నుంచి మాత్రమే అంటే రక్తసంబంధీకుల నుంచి మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది. దాత నుంచి కాలేయాన్ని సేకరించాక గ్రహితలోకి మార్చడం అనేది నిపుణులైన డాక్టర్ల బృందం మాత్రమే చేయగలుగుతారు.

ఈ బృందంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్, ఎనస్థటిస్టు, పెర్‌ఫ్యూషనిస్ట్, హెపటాలజిస్ట్ వంటి నిపుణులు ఉంటారు. కాలేయ మార్పిడిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం అవసరం. అన్ని వసతులు ఉన్న ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, బ్లడ్‌బ్యాంక్, సపోర్టివ్ ల్యాబ్‌లు ఉండాలి. సుశిక్షుతులైన సిబ్బంది ఉండాలి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఆలోచిస్తే కాలేయ మార్పిడి ఒక ఖరీదైన అంశంగా చెబుతారు. కానీ మనదేశంలో మాత్రం ఇది తక్కువ ఖరీదులోనే జరుగుతోంది.

v-raghavendrarao

కాలేయ మార్పిడి తర్వాత అది కొత్త కాలేయం శరీరానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. మాములుగా కాలేయం తన విధులను నిర్వర్తించడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది. ఇమ్యూనో సంప్రెసివ్ మందులు వాడడం ద్వారా కాలేయం శరీరానికి అలవాటు పడేలా చేస్తారు. తక్కువ ఇమ్యూనోజెనిక్ సామర్థ్యం కలిగిన అవయవంగా కాలేయాన్ని అభివర్ణిస్తారు. ఎక్కువకాలం మందులు వాడాల్సి రావచ్చు. ప్రపంచ వ్యాప్తంగా కలేయ మార్పిడి అన్ని అవయవాల మార్పిడిలో కెల్లా విజయవంతంగా ఉందని చెప్పవచ్చు.

కాలేయ మార్పిడి గురించిన అవగాహన ఇంకా సమాజంలో పెరగాల్సిన అవసరం ఉంది. అపోహలు తొలగిపోవాలి. మరణానంతరం అవయవదానం చేసే విధానం ప్రాచూర్యంలోకి రావాలి. దీర్ఘకాలిక జబ్బులను నయం చేయడం లో అవయవ మార్పిడి సమర్థవంతమైన విధానంగా మరింత ప్రాచూర్యం కల్పించాలి.

2330
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles