కాలుష్యాలను కడతేర్చే కడుపు


Tue,February 26, 2019 01:33 AM

acidity
మన శరీర పోషణకు జఠరం (అన్నాశయం) అత్యంతావశ్యకం. ఇది లేకపోతే మనం తినే ఆహారం నిలువ వుండే చోటు ఉండదు. దీని మూడు ముఖ్యమైన విధులలో ఆహార నిల్వ మొదటిది. రోజుకు రెండు నుంచి మూడుసార్లు తినే ఆహారాన్ని నిలువ వుంచుకొని దేహావసరాలకు కావలసిన శక్తి తయారీకి పోషకాలను అందిస్తుంది. దీని రెండో విధి జీర్ణక్రియకు సాయపడడం. నమిలి మింగినప్పటికీ మరింత చిన్నస్థాయికి పదార్థాన్ని విడగొట్టి అర్ధద్రవ స్థితికి తెస్తుంది. మూడో అతిముఖ్యమైన విధి ఏమిటంటే, సూక్ష్మపదార్థాలలోని కాలుష్య కారకాలను విధ్వంసం చేయడం. ఆహారంలో మంచి చెడు సూక్ష్మక్రిములను గుర్తించే పని ఇదన్నమాట. ఒకసారి నోట్లోంచి మింగిన పదార్థం కడుపులోకి చేరిన తర్వాత ఇక బయటికి రాదు. కింద పడుకున్నా లేదా తలకిందులుగా మారినా సరే. మనం తినే పదార్థాలను బట్టి కడుపులో ఆమ్లాల (యాసిడ్స్) పరిమాణాలు ఊరుతుంటాయి. కాకపోతే, అక్కడ అవి నిరంతరం తక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఎప్పుడైనా కడుపులో పట్టినంత, మితంగానే భుజించాలి. అలా కానప్పుడే అది అటు జీర్ణం కాక, ఇటు కడుపులో ఉండలేక ఇబ్బంది పెడుతుంది.

514
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles