కాదేదీ అనర్హం


Thu,December 27, 2018 12:33 AM

farmer
ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో కొత్త ఆవిష్కరణ వస్తూనే ఉంటుంది. కేవలం బట్టలతోనే అలా కొత్త ఆవిష్కరణ చేయాలని అనుకున్నాడో వ్యక్తి. రైతుగా ఉన్న అతను డిజైనర్‌గా మారి చేసిన స్ట్రీట్‌వాక్ ఇప్పుడు వైరల్ అయింది.

ఏమీ చేయకుండా ఉండడం కంటే.. ఏదో ఒకటి చేసి పాపులర్ అవ్వాలనుకునే తత్త్వం డుయో జియోగాంగ్‌ది. ఆయన వయసు 38 సంవత్సరాలు. చైనాకి చెందిన ఇతను చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద మక్కువతో రైతుగా మారాడు. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన అతనిలో ఉండేది. అందుకే డిజైనింగ్ వైపు అడుగులు వేశాడు. మామూలు డిజైనర్‌లా మారితే.. మిగతావాళ్లకి తనకు తేడా ఏంటని అనుకున్నాడు. అందుకే ఇంట్లో పనికిరాని వస్తువుల కోసం వెతికాడు. విసనకర్రలు, పైపులు, టైర్లు, ఫ్యాన్లు, కర్టెన్లు.. ఇలా పాతబడిన వస్తువులన్నింటినీ కలిపి వింతగా డ్రెస్‌లను డిజైన్ చేశాడు. మనకు ఏవైతే పనికిరావని పారేస్తామో వాటిని బంగారంలా మారుస్తానంటున్నాడు జియోగాంగ్. అలా చేసి ఊరుకుంటే అతనిలో ప్రత్యేకత ఏముంది? వాటన్నింటినీ ధరించి చైనాలోని చెంగ్డూ ప్రొవిన్స్‌లోని మీషాన్ నగర వీధుల్లో క్యాట్‌వాక్ చేశాడు. ఈ తతంగాన్నంతా వీడియోగా తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. జియో వీడియోకి స్పందన వచ్చింది. వేల సంఖ్యలో లైక్లు, షేర్లు నడుస్తున్నాయి. అలా రాత్రికి రాత్రే ఈ రైతు కమ్ డిజైనర్ స్టార్‌గా ఎదిగిపోయాడు.

470
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles