కాండిటోపియా మ్యూజియం!


Wed,September 5, 2018 11:01 PM

మ్యూజియంలో ఉన్న వాటిని తాకడమే కాదు, వాటితో ఆడుకోవచ్చట. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?
candytopia
సైన్స్‌కు సంబంధించిన పరికరాలు, పురాతన వస్తువులు, శిల్పాలు రకరకాల వస్తువులను మ్యూజియాలల్లో భద్రపరుస్తుంటారు. ఎక్కడెక్కడ్నుంచో చూడ్డానికి వచ్చిన టూరిస్టులు వాటి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటారు. అయితే, ఎప్పుడూ వాటిని దూరం నుంచి చూడ్డమే కానీ, తాకడానికి అనుమతించరు. కానీ, కాండిటోపియా మ్యూజియం వాళ్లు కొత్తగా ఆలోచించారు. పర్యాటకుల మనసు గెలుచుకునేందుకు మ్యూజియంలోని వస్తువులు, బొమ్మలు, శిలలు, శిల్పాలను తాకేందుకు, వాటితో ఆడుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మ్యూజియం న్యూయార్క్‌లో ఉంది. దీనిని చూడడానికి ఎక్కడెక్కడ్నుంచో జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ మ్యూజియంలో మొత్తం 12 గదులుంటాయి. ప్రతి గదిలో చాక్లెట్ ట్రఫుల్స్, కాటన్ కాండి టఫ్ఫీ, పిక్సీ స్టిక్‌లను పెట్టారు. అలాగే కాండీతో తయారుచేసిన ఆర్ట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. బయటకి వస్తే జంతువుల శిల్పాలు, రంగు రంగుల చేపలు, రెక్కలుండే వరాహం, రంగురంగుల గుర్రాలను కాండితో తయారు చేశారు. వీటిని చూడ్డమే కాదు ఆడుకోవడానికీ వీలు కల్పించారు. వాటితో ఆడుకునేటప్పుడు విరిగిపోయినా ఏమీ అనరు. అక్కడకి వెళ్లిన ప్రతీ ఒక్కరు వారి వయసును మరిచిపోయి చిన్న పిల్లల్లా ఆడుతూ కేరింతలు కొట్టటం దీని విశేషం. 2018 నవంబర్ 15 వరకు ఈ మ్యూజియం విజిటింగ్‌కి వెళ్లొచ్చు.

558
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles