కష్టాలకు ఎదురొడ్డి.. ఇంటింటికి మరుగుదొడ్డి


Tue,January 8, 2019 11:01 PM

అప్పటి వరకు నగర జీవితాన్ని అనుభవించి.. అత్తగారింటికి వెళ్లాక కష్టాలు ఎదురైతే ఎలా ఉంటుంది? కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టిన ఆలోచన తనలాంటి ఎంతోమందికి ఉపశమనం కలిగిస్తుంది. అదే ఇంటింటికి మరుగుదొడ్డి ఆలోచన..
KOMAL
ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీలు ఇస్తుంటారు. అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా వందల సంఖ్యలో గ్రామాలు అలాగే ఉన్నాయి. అప్పుడప్పుడు అలాంటి గ్రామాలు వార్తల్లోకెక్కుతున్నాయి. ఇప్పుడు నితోర గ్రామం కూడా అలాగే చర్చనీయాంశం అయింది. ఇరవై రెండేళ్ల కోమల్ హడల పెండ్లి తర్వాత ఢిల్లీ నుంచి అత్తగారి ఊరు ఘజియాబాద్ పక్కన నితోర గ్రామానికి వెళ్లింది. అప్పటి వరకు నగరంలో ఉన్న ఆమెకు అక్కడ మరుగుదొడ్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఉదయం లేవగానే కాలకృత్యాల కోసం మహిళలందరూ అడవులకు వెళ్లడం ఆలోచింపజేసింది. రక్షణ లేని ఈ సమాజంలో మరుగుదొడ్లు కూడా లేకపోవడం కరెక్ట్ కాదని అనుకున్నది. ప్రతి రోజూ ఉదయం పురుషులను దాటుకుంటూ మరుగుదొడ్లకు పోవాలంటే ఇబ్బందిగా తనలాగే అందరికీ ఉంటుందని గమనించింది. ఈ విషయాన్ని ఇంట్లో భర్తకు, తోటి కోడళ్లకు చెప్పి చర్చించింది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.


ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తే గ్రామంలో ఇంటింటికి మరుగుదొడ్డి కట్టిస్తానని బాధ్యతగా తీసుకున్నది. నితోర గ్రామంలోని 250 ఇండ్లకు మరుగుదొడ్లను కట్టించింది. ఆమె ఆలోచనతో బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దింది. ఈ ఒక్క అంశాన్నే కాదు.. గ్రామంలో ఉన్న అభివృద్ధి అంశాలను కూడా లేవనెత్తి చర్చిస్తున్నది. పర్యావరణాన్ని రక్షిస్తూ ప్రకృతిని కాపాడుతూ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నది. అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిగ్రాని సమితిలో సభ్యురాలిగా ఉన్నది. నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్ యూనిసెఫ్ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామాన్ని సందర్శించింది. అప్పుడు కోమల్ ప్రస్తావన వచ్చింది. అందరూ ఆమె గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఊరి మార్పు కోసం ప్రయత్నం మొదలుపెట్టి విజయవంతం అయిన ఆమె సేవలకు ప్రశంసలు లభించాయి.

477
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles