కష్టాన్నే నమ్ముకున్నది!


Sat,March 16, 2019 01:56 AM

పురుషులు మాత్రమే పనిచేసే మెకానిక్ షాపులో ఓ మహిళ నిర్విరామంగా పనిచేస్తున్నది. బరువైన లారీలు, ట్రాక్టర్లు రిపేర్లు చేస్తుంటుంది. ప్యాంటు, షర్ట్ వేసుకున్న ఆమెని చూస్తే చాలామంది అసూయ పడుతుంటారు. అసలామె ఈ వృత్తిని ఎందుకు ఎంచుకుంది?
mechanic1
మధ్యప్రదేశ్‌లోని మంద్సోర్ గ్రామంలో రోడ్డు వైపున ఉన్న మెకానిక్ షాపులో పనిచేస్తున్న ఆమె పేరు మైనా. ఆమె తండ్రి మెకానిక్. ఆయన దగ్గర సరదాగా మెకానిక్ నేర్చుకున్నది. వివాహానంతరం మైనా మెట్టినింట అడుగు పెట్టింది. భర్త సంపాదనతోనే ఇల్లు గడిచేది. మైనాకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. కొన్నిరోజులకు భర్త మరణించాడు. దాంతో కుటుంబ భారం మైనా మీదనే పడింది. సరదాగా నేర్చుకున్న మెకానిక్ పనినే ప్రస్తుతం జీవనాధారంగా మార్చుకున్నది. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా అద్దె ఇంట్లో ఉంటున్నది. ఈ వృత్తిలో మైనా ఎన్నో సవాళ్లను, అవహేళనలను ఎదుర్కొన్నది. వృత్తిలోకి దిగి దాదాపు 30 యేండ్లు గడిచిపోయాయి. టైరుకి రూ. 100 చొప్పున, రోజుకి పదిటైర్లు మార్చితే వెయ్యి రూపాయలు వస్తాయి.
mechanic
ఈ మధ్యనే కార్ల సర్వీస్ సెంటర్ కూడా ప్రారంభించింది. పనితో పాటు కార్‌వాష్ కూడా చేస్తుంది. ఇన్ని పనులు చేస్తూ కుటుంబాన్ని కూడా చక్కబెడుతున్నది. అప్పట్లో వన్‌వే రోడ్డు మాత్రమే ఉండేది. చుట్టూ వేరే షాపులు కూడా ఉండేవి కావు. పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేసేది. బ్యాక్‌పెయిన్ వచ్చినప్పుడు కాస్త విశ్రాంతి తీసుకొని మళ్లీ పనిలో మునిగిపోతున్నది. మొదట్లో వ్యాపారం బాగా జరిగేది కాదు. తినడానికి ఏమీ లేక అటుకులు తినేది. ఒక్కోపనిని చక్కబెట్టుకుంటూ షెడ్‌ను డెవలప్ చేసింది. చుట్టుపక్కల వాహనాలకు ఏం రిపేర్ వచ్చినా మైనా షెడ్‌కి రావాల్సిందే. ఆమె పనితీరుని చూసిన ఆడవాళ్లు అసూయ పడేవారు. మైనా ఇన్ని పనులు చేస్తుందా? మగాడిలా సంపాదిస్తుందా? అంటూ గుసగుసలాడేవారు.

740
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles